01.03.2026 నెల్లూరులో ఓల్డ్ వెన్నెల ఐస్‌క్రీమ్‌లో ఆంధ్రప్రదేశ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షుడు చేజర్ల సుధాకర్ రావు ఏఎన్ఎంలకు 28 ఏళ్లుగా పదోన్నతుల జాప్యం జరుగుతోందని పేర్కొంటూ కొత్త పోస్టులు మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా జంగా శ్రీనివాసులును జిల్లా వైస్ ప్రెసిడెంట్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.



