గూడూరు : ఎస్ కే ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ ఆధ్వర్యంలో (జనవరి 25) జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం సింహాద్రి మాట్లాడుతూ 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నదని, అర్హులని ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, విద్యార్థిని విద్యార్థులు తమ పరిసర ప్రాంతాలలో ఓటర్ గుర్తింపు కార్డు తీసుకోని వారిని పేరు నమోదు చేసుకునేటట్లు చూడాలని సూచించారు. అనంతరం కార్యక్రమంలో రాజనీతి శాస్త్ర అధ్యాపకులు రవిరాజు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా పోరాడి పొందిన హక్కు ఓటు హక్కు అని, ప్రతి ఓటు దేశ భవిష్యత్తును నిర్ణయించడంలో కీలక పాత్ర వహిస్తుందని అటువంటి ఓటును విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా అధ్యాపక సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు ఓటరు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. శ్రీనివాసులు, డాక్టర్ కే. శివప్రసాద్, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ పి. నారాయణరాజు, అధ్యాపకులు డాక్టర్ ఝాన్సీ వాణి, డాక్టర్ గోవిందు సురేంద్ర, శ్రీధర్ శర్మ, డాక్టర్ కోటేశ్వరరావు, డాక్టర్ విజయ్ మహేష్, డాక్టర్ శైలజ, డాక్టర్ పీర్ కుమార్ తదితర అధ్యాపక సిబ్బంది అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
# స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర #
ఎస్.కే.ఆర్ కళాశాలలో స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం లో భాగంగా పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన అభివృద్ధి, ప్లాస్టిక్ రహిత, చెత్త రహిత, ఆకుపచ్చని పరిసరాలను పెంపొందించడం మొదలైన అంశాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా పరిసరాలను సంరక్షిస్తామని అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు.



