ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు దేవస్థానాలలో నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం.
ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు పట్టణంలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి మరియు శ్రీ వేంకటాచల స్వామి వార్ల దేవస్థానాల నూతన చైర్మన్లు మరియు పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమాన్ని దేవాదాయ, ధర్మాదాయ శాఖ గన్నవరం ఇన్స్పెక్టర్ అనురాధ పర్యవేక్షణలో, ఆలయ ఈ.ఓ. దుర్గా ప్రసాద్ నిర్వహించారు.
కొత్త పాలకవర్గాలు ముందుగా ఆయా ఆలయాల్లోని శ్రీ వేంకటాచల స్వామి మరియు శ్రీ రామలింగేశ్వర స్వామి వార్లను దర్శించుకుని, ఆలయ అర్చకుల ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
కూటమి నాయకులు, పట్టణ వ్యాపార ప్రముఖులు, స్నేహితులు నూతన చైర్మన్లను (జంగాల మురళి, పర్వతం శ్రీనివాసరావు) మరియు సభ్యులను శాలువాలు కప్పి, పూలదండలు వేసి సత్కరించారు. తిరువూరు నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో, ఎం.పి., ఎమ్మెల్యేల సమక్షంలో జరగాల్సిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికెట్ అథారిటీ చైర్మన్ శావల దేవదత్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. మాజీ ఏ ఏం సి చైర్మన్ తాళ్లూరి రామారావు, మున్సిపల్ కౌన్సిలర్లు షేక్ హుస్సేన్, జీడిమళ్ళ సత్యవతి, తిరువూరు సొసైటీ చైర్మన్ కంచి బాబీ, పట్టణ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు మల్లెల శ్రీనివాసరావు, పరిశే రామలింగేశ్వర రావు, మండల పార్టీ అధ్యక్షులు దుబ్బాకు వెంకటేశ్వర రావు, విజయవాడ పార్లమెంట్ తెలుగు యువత నాయకులు మాదల హరి చరణ్ (కిట్టు), టిడిపి నాయకులు మోదుగు వెంకటేశ్వర రావు, గద్దె వెంకన్న, జనసేన నాయకులు లింగినేని సుధాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


