గోపాల్‌రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, భైంసా విద్యార్థులు ఎన్‌ఎస్‌ఎస్ కార్యక్రమం మూడవ రోజు వాటోలి గ్రామంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఉదయం అల్పాహారం అనంతరం విద్యార్థులు గ్రామ పరిసరాల్లో పచ్చదనం కోసం మొక్కలు నాటడం కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిద్దాం అనే అంశంపై గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.
మధ్యాహ్నం తరువాత ప్రసిద్ధ యోగ ఇన్‌స్ట్రక్టర్ శోభ మందాని మేడం గారు విద్యార్థులకు యోగ యొక్క ప్రాముఖ్యత, ఆరోగ్య పరిరక్షణలో యోగ యొక్క పాత్ర పై అవగాహన కల్పించారు.
💫విద్యార్థుల ఉత్సాహం, గ్రామ ప్రజల సహకారం, మరియు శోభ మేడం మార్గదర్శకతతో ఈ రోజు కార్యక్రమం అత్యంత విజయవంతంగా ముగిసింది.


