*విద్యార్థులను అభినందిస్తున్న ఎమ్మెల్యే*
*పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ 22 /11 /2025*
*మహబూబ్నగర్ ఫస్ట్ అనే కార్యక్రమంలో వందేమాతరం ఫౌండేషన్ మరియు జిల్లా విద్యాశాఖ సంయుక్తంగా స్థానిక ఎమ్మెల్యే తన సొంత నిధులతో విద్యా హబ్బుగా పాలమూరు మహబూబ్నగర్ జిల్లాలో అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్నారని నిర్వాహకులు అభినందించారు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రేపు జరగబోయే నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్షల్లో అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లాకు చెందిన విద్యార్థులకు రావాలని ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో వందేమాతరం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు రవీందర్ సార్ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల పట్ల బాధ్యతగా మెలగాలని అప్పుడే ఇలాంటి శిక్షణ కార్యక్రమాల్లో విజయవంతమవుతాయని వారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు కార్యక్రమంలో అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ శ్రీనివాస్, నిర్వాహకులు రవీందర్ రెడ్డి ,ఎంఈఓ మంజుల దేవి మరియు ఉపాధ్యాయ బృందం ఎమ్ ఎన్ విజయకుమార్, చాంద్ పాషా తదితరులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు*


