(పున్నమి ప్రతినిధి తేదీ 6 .10. 2025 నిర్మల్ జిల్లా)ఈ రోజు ముధోల్ మండలంలోని ఎడ్ బిడ్ గ్రామంలో సత్యమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తరువాత ఎమ్మెల్యే గారు చింతకుంట గ్రామానికి చేరుకొని, ఎన్నికల హామీ ప్రకారం పురాతన హనుమాన్ ఆలయానికి వెళ్లే మార్గంలో బిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేసి నిర్మాణ పనులు పూర్తి చేసినందుకు, గ్రామస్థులు ఆయనకు ఘన సన్మానం నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఎమ్మెల్యే గారి ప్రజా సేవా తపనను ప్రశంసించి కృతజ్ఞతలు తెలిపారు. 🙏💐


