పున్నమి ప్రతినిధి:
ఎం పి పి ఎస్ ఆర్కేపురం ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
మండల ప్రజా పరిషత్ ఎం పి పి ఎస్ ఆర్కేపురం ప్రభుత్వ పాఠశాలలోని శుక్రవారం స్థానిక హెడ్ మాస్టర్ బి.కల్పన ఆధ్వర్యంలో ఘనంగా పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల హెడ్ మాస్టర్ బి.కల్పన మాట్లాడుతూ… ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం ఆనందం కలిగి అనుకున్న విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల ఎస్జిటీ సయ్యద్ రూహి, టి.వర్షా తదితరులున్నారు



