Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

ఎంపీ వేమిరెడ్డి ఎమ్మెల్యే దగ్గుమాటి ప్రచారం.. 26వ వార్డులో కోట సురేందర్ రెడ్డికి మద్దతు!

Punnami Newsroom Published:
ఎంపీ వేమిరెడ్డి ఎమ్మెల్యే దగ్గుమాటి ప్రచారం.. 26వ వార్డులో కోట సురేందర్ రెడ్డికి మద్దతు!

సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి

పున్నమి న్యూస్ రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి

కావలి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 26వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కోట సురేందర్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి పాల్గొని ప్రజలను కలుసుకున్నారు.

ఈ సందర్భంగా నాయకులు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలను కలిసి స్థానిక సమస్యలు, వార్డు అభివృద్ధి అంశాలపై వివరించారు. కావలి మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం రూ.450 కోట్ల నిధులు కేటాయించినట్లు ప్రచారంలో వెల్లడించారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి భరత్ కుమార్‌తో పాటు 44 వార్డుల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతు తెలపాలని కోరారు.

అదేవిధంగా 26వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కోట సురేందర్ రెడ్డి కి ప్రజల మద్దతు కోరుతూ ప్రచారం నిర్వహించారు. వార్డు అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఆయనకు మద్దతు తెలపాలని, సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఎంపీ వేమిరెడ్డి ఎమ్మెల్యే దగ్గుమాటి ప్రచారం.. 26వ వార్డులో కోట సురేందర్ రెడ్డికి మద్దతు!

ఎంపీ వేమిరెడ్డి ఎమ్మెల్యే దగ్గుమాటి ప్రచారం.. 26వ వార్డులో కోట సురేందర్ రెడ్డికి మద్దతు!

ఎంపీ వేమిరెడ్డి ఎమ్మెల్యే దగ్గుమాటి ప్రచారం.. 26వ వార్డులో కోట సురేందర్ రెడ్డికి మద్దతు!

News Sources

  • Punnami ReportingOwn reporting

Leave a comment

Your email address will not be published. Required fields are marked *