Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

ఆత్మకూరు వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికలో అనూహ్య మలుపులు!

Punnami Newsroom Published: Updated:
ఆత్మకూరు వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికలో అనూహ్య మలుపులు!

Story highlights

  • ఆత్మకూరు, నవంబర్ 24 (కోటకొండ హరికిరణ్ – పున్నమి ప్రతినిధి):ఆత్మకూరు మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
  • సోమవారం నిర్వహించిన ఎన్నికల్లో జనసేన పార్టీకి చెందిన కత్తి పద్మజ వైస్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.
  • అయితే సోమవారం జరిగిన ఎన్నికను రద్దు చేసి మంగళవారం మరోసారి ఎన్నికల ప్రక్రియ నిర్వహించడంతో రాజకీయ పరిణామాలు అనూహ్య మలుపు తిరిగాయి.

సోమవారం కత్తి పద్మజ ఎన్నిక.. మంగళవారం ఎన్నిక రద్దు చేసి కొలగాని శిరీషకు బాధ్యతలు

ఆత్మకూరు, నవంబర్ 24 (కోటకొండ హరికిరణ్ – పున్నమి ప్రతినిధి):ఆత్మకూరు మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. సోమవారం నిర్వహించిన ఎన్నికల్లో జనసేన పార్టీకి చెందిన కత్తి పద్మజ వైస్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. అయితే సోమవారం జరిగిన ఎన్నికను రద్దు చేసి మంగళవారం మరోసారి ఎన్నికల ప్రక్రియ నిర్వహించడంతో రాజకీయ పరిణామాలు అనూహ్య మలుపు తిరిగాయి. మంగళవారం జరిగిన ఎన్నికలో జనసేనకు చెందిన కొలగాని శిరీష వైస్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.మొదట కత్తి పద్మజ ఎన్నిక కావడం, అనంతరం ఆ ఎన్నిక రద్దు చేసి మరో అభ్యర్థిని ఎన్నుకోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ పరిణామాలపై బీజేపీ కౌన్సిలర్‌ నల్లిపెట్టి శ్రీనివాసులు, జనసేన కౌన్సిలర్‌ కత్తి పద్మజ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. నిరసనగా వారు మంగళవారం నిర్వహించిన సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక వ్యవహారం పట్టణంలో చర్చనీయాంశమైంది.మరోవైపు కొలగాని శిరీష వైస్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నిక కావడంతో జనసేన నాయకులు, కార్యకర్తలు మున్సిపల్‌ కార్యాలయం వద్ద సంబరాలు నిర్వహించారు. బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కొలగాని శిరీష తన ఎన్నికకు సహకరించిన కౌన్సిలర్లకు, జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌కు, మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.రెండు రోజుల వ్యవధిలో వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికలో చోటుచేసుకున్న ఈ మార్పులు ఆత్మకూరు మున్సిపల్‌ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *