సీతారామపురం జనవరి(పున్నమి ప్రతినిధి )
వైఎస్ఆర్సిపి ని గ్రామస్థాయి నుండి బలోపేతం చేసే దిశగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా సోమవారం నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరులోని డిఆర్ ఉత్తమ్ హోటల్లో ఏర్పాటుచేసిన జిల్లా స్థాయి సంస్థాగత కమిటీల నిర్మాణంపై జరిపిన విస్తృతస్తాయి సమావేశంలో సీతారామపురం మండలానికి చెందిన వైసిపి యువనేత పాలగిరి ముద్దుకృష్ణమరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్ఆర్సిపి రీజనల్ కోఆర్డినేటర్, రాజంపేట పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
Uploaded Video:


