Sunday, 7 December 2025
  • Home  
  • ఉర్దూ అకాడమీ చైర్మన్‌గా ఫారూఖ్ శుబ్లీ నియామకం – మైనార్టీల గౌరవాన్ని నిలబెట్టిన సీఎం చంద్రబాబుకు గుల్జార్ భాష అభినందనలు
- అన్నమయ్య

ఉర్దూ అకాడమీ చైర్మన్‌గా ఫారూఖ్ శుబ్లీ నియామకం – మైనార్టీల గౌరవాన్ని నిలబెట్టిన సీఎం చంద్రబాబుకు గుల్జార్ భాష అభినందనలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌గా జనాబ్ ఫారూక్ శుబ్లీ నియమించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును రాష్ట్ర మాజీ ఏపీ.ఆర్.డీసీ డైరెక్టర్,మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాజంపేట నియోజకవర్గ అధ్యక్షులు, మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు షేక్ గండికోట గుల్జార్ భాష హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా గుల్జార్ భాష మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ కాలంలో రాష్ట్రంలో ఎక్కడ మైనార్టీల పై అన్యాయం జరిగినా,ఆ అన్యాయానికి ఎదురుగా ముందువరుసలో నిలిచి పోరాడిన యోధుడు ఫారూఖ్ శుబ్లీ అని పేర్కొన్నారు.ఎన్నో తప్పుడు కేసులు ఎదుర్కొన్నప్పటికీ, మైనార్టీల హక్కుల కోసం మొక్కవోని దీక్షతో ఉద్యమించిన ఆయనకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ బాధ్యత పోరాటానికి వచ్చిన గొప్ప గుర్తింపు అని అన్నారు.2024 రాష్ట్ర ఎన్నికల్లో మైనార్టీ ఓట్లను తెలుగుదేశం పార్టీవైపు సమీకరించడం లో ఫారూఖ్ శుబ్లీ పాత్ర విశేషమని,ఆయన చేసిన సేవలకు గాను ఈ చైర్మన్ పదవి మరింత న్యాయం చేస్తుందని గుల్జార్ భాష తెలిపారు.అదే విధంగా, ఉర్దూ భాష అనేది శతాబ్దాలుగా సాహిత్యం, గజల్,కవిత్వానికి నిలువెత్తు స్తంభమై ఉందని,ఈ భాషను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందంజలో ఉండటం రాష్ట్ర మైనార్టీలకు ఆనందకర విషయమన్నారు.రాష్ట్రంలోని మైనార్టీ వర్గాలు అన్ని చోట్లా ఫారూఖ్ శుబ్లీ నియామకాన్ని హర్షం వ్యక్తం చేస్తున్నాయని, భవిష్యత్తులో ఆయన నేతృత్వంలో ఉర్దూ భాష అభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు చేపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌గా జనాబ్ ఫారూక్ శుబ్లీ నియమించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును రాష్ట్ర మాజీ ఏపీ.ఆర్.డీసీ డైరెక్టర్,మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాజంపేట నియోజకవర్గ అధ్యక్షులు, మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు షేక్ గండికోట గుల్జార్ భాష హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా గుల్జార్ భాష మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ కాలంలో రాష్ట్రంలో ఎక్కడ మైనార్టీల పై అన్యాయం జరిగినా,ఆ అన్యాయానికి ఎదురుగా ముందువరుసలో నిలిచి పోరాడిన యోధుడు ఫారూఖ్ శుబ్లీ అని పేర్కొన్నారు.ఎన్నో తప్పుడు కేసులు ఎదుర్కొన్నప్పటికీ, మైనార్టీల హక్కుల కోసం మొక్కవోని దీక్షతో ఉద్యమించిన ఆయనకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ బాధ్యత పోరాటానికి వచ్చిన గొప్ప గుర్తింపు అని అన్నారు.2024 రాష్ట్ర ఎన్నికల్లో మైనార్టీ ఓట్లను తెలుగుదేశం పార్టీవైపు సమీకరించడం లో ఫారూఖ్ శుబ్లీ పాత్ర విశేషమని,ఆయన చేసిన సేవలకు గాను ఈ చైర్మన్ పదవి మరింత న్యాయం చేస్తుందని గుల్జార్ భాష తెలిపారు.అదే విధంగా,
ఉర్దూ భాష అనేది శతాబ్దాలుగా సాహిత్యం, గజల్,కవిత్వానికి నిలువెత్తు స్తంభమై ఉందని,ఈ భాషను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందంజలో ఉండటం రాష్ట్ర మైనార్టీలకు ఆనందకర విషయమన్నారు.రాష్ట్రంలోని మైనార్టీ వర్గాలు అన్ని చోట్లా ఫారూఖ్ శుబ్లీ నియామకాన్ని హర్షం వ్యక్తం చేస్తున్నాయని, భవిష్యత్తులో ఆయన నేతృత్వంలో ఉర్దూ భాష అభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు చేపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.