శ్రీకాళహస్తి భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన విప్లవ వీరులు భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్గురుల త్యాగం అజరామరమని శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కొనియాడారు. సోమవారం ‘అమరవీరుల దినోత్సవం’ (షహీద్ దివస్) సందర్భంగా పట్టణంలో వారి చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ, దేశ విముక్తి కోసం యవ్వన ప్రాయంలోనే ఉరికంభాన్ని ఎక్కిన ఈ ముగ్గురు వీరులు భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. వారి పోరాట పటిమ నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అనంతరం కార్యకర్తలు “భగత్ సింగ్ అమర్ రహే”, “ఇంక్విలాబ్ జిందాబాద్”, “భారత్ మాతాకీ జై” అంటూ చేసిన నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఉదయ్ కుమార్ రెడ్డి, కొరియర్ రవి, జగదీష్, అత్తూరు హరి, భాస్కర్ రెడ్డి, మోహన్ రావు, పవర్ సుమన్ మరియు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. భరతమాత దాస్య శృంఖలాలను తెంచేందుకు వారు చేసిన పోరాటాన్ని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.

ఉరిశిక్షను చిరునవ్వుతో ముద్దాడిన వీరులకు టీడీపీ నాయకుల ఘన నివాళి