


శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట మండలం, దేవాది గ్రామంలో వెలసియున్న శ్రీశ్రీశ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయంలో, ఉత్తరప్రదేశ్ కు చెందిన నేవీ అధికారి బిజేందర్ సింగ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాస వైభవంలో భాగముగా, ఆలయ ప్రధాన అర్చకులు శైవ శ్రీ చదువుల నమశ్శివాయ స్వామి, శైవ శ్రీ చదువుల వాసుదేవరావు ఆలయ విశిష్టతను తెలియజెసి రుద్రాభిషేకం జరిపించారు. అనంతరం నేవీ అధికారి బిజేందర్ సింగ్ మాట్లాడుతూ శివుడు భోళాశంకరుడని, అభిషేక ప్రియుడని, శివానుగ్రహం పొందడానికి భగవంతునిపై భక్తితోపాటు, సేవాతత్వం కలిగిఉండాలని, పరులకు సేవ వృధాకాదన్నారు. ఆపదలో ఉండేవారికి తోచిన సాయం చేస్తే, భగవంతునికి సేవ చేసినట్లేనని, నిస్సహాయులకు చేసిన సేవే, మాధవసేవన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శైవ శ్రీ చదువుల నమశ్శివాయ స్వామి, శైవ శ్రీ చదువుల వాసుదేవరావు, బిజేందర్ సింగ్ దంపతులకు తీర్థప్రసాదాలను, వేద ఆశీర్వాదాలను అందించారు.

