సిద్దవటం సెప్టెంబర్ (పున్నమి )
ఏపీ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన ఓజి సినిమా విడుదల సందర్భంగా సిద్ధవటం మండలం ఉప్పరపల్లిలో గురువారం సంబరాలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం,కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ ఓజీ చిత్రం విడుదల సందర్భంగా రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ సమన్వయకర్త అతి కారి కృష్ణ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మహోత్త రమైన వ్యక్తి అని గత వైసీపీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన చిత్రాలను విడుదల అయ్యే సమయంలో ఎన్నో కుట్రలు,కుతంత్రులు చేశారన్నారు.ఎంతమంది అడ్డు తగిలిన అభిమానాన్ని మాత్రం వేరు చేయలేరని తెలిపారు.ఓజి సినిమా విజయవంతం కావాలని రామయ్య ఆకాంక్షించారు.అవ్వారు రవిశంకర్ మాట్లాడుతూ పార్లమెంటు సమన్వయకర్త కృష్ణ ఆదేశాలతో ఓజి,సినిమా విడుదల సందర్భంగా వేడుకలు వైభవంగా జరిగాయన్నారు.అభిమానుల కోసం మరెన్నో సినీ చిత్రాలు డిప్యూటీ సీఎం నటించాలని స్వచ్ఛందంగా వేడుకల్లో వీర మహిళలు పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ యువనేత డేరంగుల శ్రీకాంత్ వీర మహిళలు అభిమానులు పాల్గొన్నారు.


