*రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎం ఎన్ విజయకుమార్ డిమాండ్*
*(పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ 19/11/2025)*
*టీచర్లకు టెట్ తిప్పలు*
*లాంగ్వేజెస్, ఇంగ్లిష్, బయోలజీ, ఫిజిక్స్ టీచర్లకు ఇబ్బందులు*
*వాళ్లకు సంబంధం లేని సబ్జెక్టుల నుంచే 90 మార్కులు*
*సబ్జెక్ట్ పరంగా టెట్ పెట్టాలని డిమాండ్*
*రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర గౌరవాధ్యక్షులు డిమాండ్*
*రెండేండ్లలోపే క్వాలిఫై కావాల్సినోళ్లు 45 వేల మంది టీచర్లు*
*పిల్లలకు పరీక్షలు పెట్టే టీచర్లకు సుప్రీంకోర్టు తీర్పుతో ఆ టీచర్లకూ సర్కారు ఎగ్జామ్ పెట్టబోతున్నది. పిల్లలు ఫెయిలైతే మళ్లీ పరీక్షలు రాసుకునే వెసులుబాటు ఉండగా, సర్కారు పెట్టే పరీక్ష రెండేండ్లలోపు పాస్ గాకపోతే వారంతా ఇంటిదారి పట్టాల్సిందే. అయితే, అభ్యర్థుల వరకూ రాసేందుకు సిద్ధంగా ఉన్నా, ఇన్ సర్వీస్ టీచర్లలో మాత్రం ఆందోళన మొదలైంది.దీనికి ప్రధాన కారణం.. ఎగ్జామ్ సిలబస్ లో వారికి సంబంధం లేని సబ్జెక్టులు ఉండటమే. 15-20 ఏండ్ల కిందే వదిలేసిన సబ్జెక్టుల్లోంచి పరీక్షల్లో ప్రశ్నలు వస్తే పరీక్ష ఎలా రాయాలని వారంతా ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో సర్కారు స్కూళ్లలో ప్రస్తుతం 1.11 లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. వీరిలో 2012 కంటే ముందే రిక్రూట్ అయిన టీచర్లు కూడా టెట్ క్వాలిఫై కావల్సిందేనని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. రిటైర్మెంట్ కు ఐదేండ్ల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్న టీచర్లు తమ సర్వీస్ ను కొనసాగించాలంటే, ఉత్త ర్వుల తేదీ నుంచి రెండేండ్లలోపు తప్పనిసరిగా టెట్ పాస్ కావాల్సిందే. మరోపక్క ఐదేండ్లలోపు సర్వీస్ ఉన్న టీచర్లు కూడా ప్రమోషన్ పొందాలంటే టెట్ క్వాలిఫై కావాల్సి ఉంది. అయితే, 2012 తర్వాత జరిగిన అన్ని టీచర్ రిక్రూట్ మెంట్లలో టెట్ క్వాలిఫై అయిన వారే టీచర్లు వచ్చారు. కానీ, అంతకు ముందే రిక్రూట్ అయిన టీచర్లకు మాత్రం టెట్ గండం మొదలైంది. సర్వీస్ లో కొనసాగాలంటే రెండేండ్లలోపు తప్పనిసరిగా 45,742 మంది టీచర్లు, ప్రమోషన్లు పొందాలంటే 60,094 మంది టీచర్లు టెట్ క్వాలిఫై కావాల్సి ఉంది. టెట్ కు రెండు రోజుల నుంచి దరఖా స్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఇన్ సర్వీస్ టీచర్లలో ఎస్జీటీలు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు పేపర్ 1కు. స్కూల్ అసిసెంట్లు, లాంగ్వేజీ పండిట్లు, హెడ్మాస్టర్లు పేపర్ 2 ఎగ్జామ్ కు అటెండ్ కావాల్సి ఉంది.*
*టెట్ లో సంబంధం లేని సబ్జెక్టులు*
*పేపర్ 1, పేపర్ 2 పరీక్షలు 150 క్వశ్చన్లతో ఎగ్జామ్ ఉంటుంది. ఈ 2 పేపర్లలో తెలుగు, ఇంగ్లిష్, చైల్డ్ డెవలప్ మెంట్ అండ్ పెడగొజీ (సైకాలజీ) ఒక్కో సబ్జెక్టుకు 30 చొప్పున 90 మార్కులు అందరికీ కామన్ గా ఉంటాయి. పేపర్ 1లో మ్యాధ్స్ కు 30 మార్కులు, ఎన్విరాన్ మెంటల్ స్టడీస్ కు మరో 30 మార్కులున్నాయి. పేపర్ 2లో సోషల్ స్టడీస్ టీచర్లకు హిస్టరీ, జియోగ్రఫీ, సివిక్స్. ఎకనామిక్స్. పెడగోజి తదితర వాటి నుంచే 60 మార్కులు రానున్నాయి. ఎస్ఏ మ్యాథ్స్, ఫిజిక్స్, బయోలజీ టీచర్లకు 30 మార్కులు మ్యాథ్స్, సైన్స్ 30 మార్కులు ఉండ నున్నాయి. సైన్స్ లోనూ ఫిజిక్స్ లో 12 మార్కులు, బయోలజీ 12 మార్కులు, సైన్స్ పెడగోజీ నుంచి 6 మార్కులు రానున్నాయి.*
. డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్, తెలుగు, ఇతర సబ్జె క్టుల్లో టీచర్లకు వచ్చిన వారి పరిస్థితి కూడా దాదాపు ఇలాంటిదే. వారంతా 30 మార్కులే ఆయా సబ్జెక్టుల కు సంబంధించిన క్వశ్చన్లు రానున్నాయి. వీరంతా మ్యాథ్స్ 30 మార్కులు ఎలా చేయగలమని ప్రశ్ని స్తున్నారు. ఉదాహరణకు ఇంగ్లిష్ టీచర్లు మ్యాథ్స్, బయోలజీ, ఫిజిక్స్, తెలుగు సబ్జెక్టుల పరీక్షలు ఎలా రాయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.*
*టీచర్లకు వారి సబ్జెక్టుల్లోనే టెట్ పెట్టాలి*
*విద్యాహక్కు చట్టం నిబంధనల్లో టెట్ అంశాన్ని 2010లో పొందుపరిచారు. ఈ చట్టం ప్రకారం.. 2010 నుంచి ప్రమోషన్ కోసం ఇన్ సర్వీస్ టీచర్లకు వారు బోధిస్తున్న సబ్జెక్టుల పరంగా మాత్రమే పరీక్ష ఉండాలి. 2010 కన్నా ముందున్న వారికి అంటే.. 1995 నుంచి చట్టం అమల్లోకి రాకంటే ముందున్న వారికి టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి. ప్రమోషన్ కోసం వారి సంబంధిత సబ్జెక్టులో మాత్రమే టెట్ ఉండాలని కోరుతున్నాం.*
?దయచేసి ప్రభుత్వం ఆలోచించి, ఇన్ సర్వీస్ టీచర్లకు సబ్జెక్టుల వారీగా టెట్ పెట్టాలి.


