ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం. రమేష్ కుమార్ శుక్రవారం కర్నూలు నగరంలో పర్యటించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి నగరి సుధాకర్, నంద్యాల జిల్లా అధ్యక్షుడు నాగేంద్రప్ప, జిల్లా కోశాధికారి బి.శ్రీనివాసులు తదితరులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం వెంటనే పెండింగ్‌లో ఉన్న బకాయిలు మంజూరు చేయాలని, మధ్యంతర భృతిని త్వరగా విడుదల చేయాలని వారు ప్రభుత్వానికి నివేదించాలని ప్రధాన కార్యదర్శిని అడిగారు. అలాగే జిల్లా తాలూకాల బలోపేతం, సంఘ కార్యకలాపాల అభివృద్ధిపై కూడా చర్చించారు

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి