


విశాఖపట్నం, అక్టోబర్ 5:
పేదల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి మరో కీలక ముందడుగు వేసింది. మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం కారణంగా ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రవేశపెట్టిన “ఆటో డ్రైవర్ల సేవలో” పథకం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా అమలవుతోంది.
ఈ పథకం కింద ప్రతి ఆటో డ్రైవర్‌కు ఏటా రూ.15,000 ఆర్థిక సాయం అందజేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,90,669 మంది డ్రైవర్లు అర్హులుగా గుర్తించబడి, ఈ పథకానికి సుమారు రూ.436 కోట్లు వ్యయం కానున్నాయి. అర్హులైనా లబ్ధిదారుల జాబితాలో చోటు దక్కని వారి సమస్యలను రాబోయే విడతల్లో పరిష్కరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
ఈ క్రమంలో శనివారం విశాఖ ఉత్తర నియోజకవర్గం మాధవధారలోని మాధవస్వామి కళ్యాణ మండపం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో, 2,562 లబ్ధిదారులకు రూ.3,84,30,000 విలువైన నగదు బదిలీ చేయడం జరిగింది.
కార్యక్రమంలో ఎమ్మెల్యే & బీజేపీ ఫ్లోర్ లీడర్ శ్రీ పీ. విష్ణుకుమార్ రాజు పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, “మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల నష్టపోయిన ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీ సామాజిక న్యాయం వైపు ముఖ్యమైన అడుగు” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉత్తర నియోజకవర్గ ఇన్‌చార్జ్ శ్రీమతి శ్యామల దీపిక, ఎంవిఐ మునీశ, ఆర్టీవో దేవి, జోనల్ కమిషనర్ రాము, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ & స్పెషల్ ఆఫీసర్ ప్రవీణ, కార్పొరేటర్లు ఉషాశ్రీ, సారిపల్లి గోవింద్, కంపా హనూక్, ఆళ్ల లీలావతి, కామేశ్వరి, సనపల వరప్రసాద్, ఈతలపాకు సుజాత, అలాగే బీజేపీ జిల్లా అధ్యక్షులు పరశురామ్ రాజు, టిడిపి, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.
లబ్ధిదారులు పథకం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వానికి మరియు ఎమ్మెల్యే పీ. విష్ణుకుమార్ రాజు గారికి ధన్యవాదాలు తెలిపారు.

