Thursday, 31 July 2025
  • Home  
  • ” ఉచిత అంబులెన్స్ సర్వీసులు పెంచాలి”. – ప్రజా ఆరోగ్య వేదిక విజ్ఞప్తి.
- Featured - ఆంధ్రప్రదేశ్

” ఉచిత అంబులెన్స్ సర్వీసులు పెంచాలి”. – ప్రజా ఆరోగ్య వేదిక విజ్ఞప్తి.

 ప్రపంచాన్ని పట్టి కుదిపేస్తున్న కరోనా మన దేశాన్ని కూడా అతలాకుతలం చేస్తోంది. దాన్ని కట్టడి చేసే ప్రణాళికలో భాగంగా కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా “లాక్ డౌన్” ప్రకటించి పకడ్బందీగా అమలు చేస్తున్నాయి. ఇలాంటి నిర్బంధ సందర్భాల్లో ఎవరికైనా అనారోగ్య అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు కేవలం ఒక్క 108 అంబులెన్స్ సేవలు తప్ప ఇతర ప్రైవేటు వాహనాలు అందుబాటులో లేవు. గుండెనొప్పితో అల్లాడిపోతున్నా , కాన్పు నొప్పులతో గిలగిలా కొట్టుకుంటున్నా దగ్గరలో ఆసుపత్రిలో అందుబాటులో లేక, దూరంగా పోవడానికి రవాణా సౌకర్యం లేక ప్రజలు అల్లాడిపోతున్నారు.          మన రాష్ట్రంలో 676 మండలాలు ఉన్నాయి. సుమారు 5.3 కోట్ల జనాభా కలిగి ఉన్నాం. ఇందులో 10 లక్షల జనాభా దాటిన మహా నగరాలు-2,    5 లక్షలు దాటిన నగరాలు-2,   3 లక్షలు దాటిన నగరాలు-4,   2 లక్షలు దాటిన పట్టణాలు-8,  1 లక్ష జనాభా దాటిన పట్టణాలు-17  ఉన్నాయి. కానీ వీటన్నింటికీ కలిపి మొత్తంగా చూస్తే 5 కోట్ల పైగా జనాభా గల మన రాష్ట్రంలో కేవలం 439 అత్యవసర సర్వీసు అంబులెన్సులు మాత్రమే  ఉన్నాయి. అంటే సగటున 1లక్షా 20 వేల మందికి  ఒకే ఒక్క అంబులెన్స్ సేవలందిస్తోంది. సాధారణ పరిస్థితుల్లో నైతే ఈ సంఖ్యతో ఏదో ఒక విధంగా నెట్టుకు  పోతున్నాం కానీ ప్రస్తుతం ఉన్న నిర్బంధ పరిస్థితుల దృష్ట్యా అవి రాష్ట్ర ప్రజల అవసరాలకు ఏమాత్రం  సరిపోవడం లేదు. 108 అంబులెన్స్ సేవలు అందుబాటులో లేకపోవడంతో మరియు ఇతర వాహనాలు అందుబాటులో లేకపోవడంతో సమయానికి చేరుకోలేక పోవడం వల్ల   కొందరు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి.          కావున ప్రభుత్వం  ఎపిడమిక్ వ్యాధుల చట్టం ద్వారా ప్రైవేటు ఆసుపత్రుల్లో  ఉన్న అంబులెన్స్ లను కూడా స్వాధీనం చేసుకుని రాష్ట్రం లోని ప్రతి మండలానికి కనీసం ఒక్క అంబులెన్స్ నైనా ఏర్పాటు చేయాలి. అలాగే 10 లక్షల జనాభా దాటిన 2 మహా నగరాలకు 10 అంబులెన్సులు,  3 నుంచి5 లక్షల  జనాభా కలిగిన 6 నగరాలకు 5 అంబులెన్స్లు , 1 నుంచి 3 లక్షల జనాభా గల పట్టణాలకు కనీసం 3 అంబులెన్సులు ఏర్పాటు చేయాలి.          అలాగే అత్యవసర పరిస్థితుల్లో సర్వీసు ఇవ్వడానికి ప్రభుత్వం కేవలం ఓలా క్యాబ్స్ కు  ఒక్క విశాఖ నగరంలో మాత్రమే అనుమతి ఇచ్చారు. అలాకాకుండా  లక్ష జనాభా దాటిన అన్ని పట్టణాల్లోనూ అలాంటి సర్వీసులను అనుమతిస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది.    కనుక ప్రభుత్వం ఈ విషయాన్ని వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకుని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేస్తోంది. డాక్టర్ యం.వి రమణయ్య రాష్ట్రఅధ్యక్షులు ప్రజా ఆరోగ్య వేదిక

 ప్రపంచాన్ని పట్టి కుదిపేస్తున్న కరోనా మన దేశాన్ని కూడా అతలాకుతలం చేస్తోంది. దాన్ని కట్టడి చేసే ప్రణాళికలో భాగంగా కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా “లాక్ డౌన్” ప్రకటించి పకడ్బందీగా అమలు చేస్తున్నాయి. ఇలాంటి నిర్బంధ సందర్భాల్లో ఎవరికైనా అనారోగ్య అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు కేవలం ఒక్క 108 అంబులెన్స్ సేవలు తప్ప ఇతర ప్రైవేటు వాహనాలు అందుబాటులో లేవు. గుండెనొప్పితో అల్లాడిపోతున్నా , కాన్పు నొప్పులతో గిలగిలా కొట్టుకుంటున్నా దగ్గరలో ఆసుపత్రిలో అందుబాటులో లేక, దూరంగా పోవడానికి రవాణా సౌకర్యం లేక ప్రజలు అల్లాడిపోతున్నారు.
         మన రాష్ట్రంలో 676 మండలాలు ఉన్నాయి. సుమారు 5.3 కోట్ల జనాభా కలిగి ఉన్నాం. ఇందులో 10 లక్షల జనాభా దాటిన మహా నగరాలు-2,    5 లక్షలు దాటిన నగరాలు-2,   3 లక్షలు దాటిన నగరాలు-4,   2 లక్షలు దాటిన పట్టణాలు-8,  1 లక్ష జనాభా దాటిన పట్టణాలు-17  ఉన్నాయి. కానీ వీటన్నింటికీ కలిపి మొత్తంగా చూస్తే 5 కోట్ల పైగా జనాభా గల మన రాష్ట్రంలో కేవలం 439 అత్యవసర సర్వీసు అంబులెన్సులు మాత్రమే  ఉన్నాయి. అంటే సగటున 1లక్షా 20 వేల మందికి  ఒకే ఒక్క అంబులెన్స్ సేవలందిస్తోంది. సాధారణ పరిస్థితుల్లో నైతే ఈ సంఖ్యతో ఏదో ఒక విధంగా నెట్టుకు  పోతున్నాం కానీ ప్రస్తుతం ఉన్న నిర్బంధ పరిస్థితుల దృష్ట్యా అవి రాష్ట్ర ప్రజల అవసరాలకు ఏమాత్రం  సరిపోవడం లేదు. 108 అంబులెన్స్ సేవలు అందుబాటులో లేకపోవడంతో మరియు ఇతర వాహనాలు అందుబాటులో లేకపోవడంతో సమయానికి చేరుకోలేక పోవడం వల్ల   కొందరు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి.
         కావున ప్రభుత్వం  ఎపిడమిక్ వ్యాధుల చట్టం ద్వారా ప్రైవేటు ఆసుపత్రుల్లో  ఉన్న అంబులెన్స్ లను కూడా స్వాధీనం చేసుకుని రాష్ట్రం లోని ప్రతి మండలానికి కనీసం ఒక్క అంబులెన్స్ నైనా ఏర్పాటు చేయాలి. అలాగే 10 లక్షల జనాభా దాటిన 2 మహా నగరాలకు 10 అంబులెన్సులు,  3 నుంచి5 లక్షల  జనాభా కలిగిన 6 నగరాలకు 5 అంబులెన్స్లు , 1 నుంచి 3 లక్షల జనాభా గల పట్టణాలకు కనీసం 3 అంబులెన్సులు ఏర్పాటు చేయాలి.
         అలాగే అత్యవసర పరిస్థితుల్లో సర్వీసు ఇవ్వడానికి ప్రభుత్వం కేవలం ఓలా క్యాబ్స్ కు  ఒక్క విశాఖ నగరంలో మాత్రమే అనుమతి ఇచ్చారు. అలాకాకుండా  లక్ష జనాభా దాటిన అన్ని పట్టణాల్లోనూ అలాంటి సర్వీసులను అనుమతిస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది.
   కనుక ప్రభుత్వం ఈ విషయాన్ని వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకుని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేస్తోంది.
డాక్టర్ యం.వి రమణయ్య
రాష్ట్రఅధ్యక్షులు
ప్రజా ఆరోగ్య వేదిక

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.