ఈసతక్షమే కమలాపురము ఆగస్టు (పున్నమి ప్రతినిధి)
కమలాపురం వైయస్సార్ సిపి ఇన్ చార్జ్ నరేన్ రామాంజుల రెడ్డి కమలాపురం స్థానిక పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పులివెందుల, ఒంటిమిట్టలో నిన్న జరిగిన జడ్పిటిసి ఉప ఎన్నికలు కూటమి ప్రభుత్వం ఆప్రజాస్వామికంగా నిర్వహించింది.
బై ఎలక్షన్ లను సభ్య సమాజం తలదించుకునేలా కూటమి ప్రభుత్వం ప్రవర్తించింది. కూటమి ప్రభుత్వం మొదటి సంవత్సరంలో ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసింది. రెండవ సంవత్సరంలో తల్లికి వందనం అంటూ కొంతమందికే ఇచ్చి చేయి దులుపుకుంది.కూటమి ప్రభుత్వానికి ప్రజల్లోకి పోయి ఓట్లు అడిగే దమ్ము ధైర్యం లేక ప్రజలను భయభ్రాంతులను గురిచేసింది.రోజుకో ఒకరిపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేసినా వైసిపి నాయకులు ధైర్యంగా పోరాడారు.పులివెందుల, ఒంటిమిట్టలో 30 పోలింగ్ బూతులు, 35 వేల మంది ఓటర్లు ఉండగా 15 వేల మంది పోలీసులు నియమించడంలో అంతర్యం ఏమిటి.
ఎవరిని చూసి ఎవరు భయపడుతున్నారో తెలియజేయాలి. ఒంటిమిట్ట కడప డివిజన్ ఎస్పీ పరిధిలో ఉంటే అన్నమయ్య జిల్లా ఎస్పీ వచ్చి విధులు నిర్వహిస్తూ అక్కడి ఎస్ఐలను సీఐలను పోలీసులను తెచ్చి రిగ్గింగ్ కు కీలక పాత్ర పోషించారు. బూతుల్లో ఉన్న అధికారులు కూడా కూటమి ప్రభుత్వానికి సహకరించారు. వీరిపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్.
పులివెందులలో ఓటింగ్ జరుగుతుంటే కమలాపురం ఓటర్లకు అక్కడ ఏం పని. ఓట్లు వేశామని సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో చక్కర్లు కొలుతుంటే పోలీసు వ్యవస్థ ఏమి చేస్తుంది.
పులివెందులలో దొంగ ఓట్లు వేయడానికి కూడా టిడిపి కి దిక్కులేక
పక్క నియోజకవర్గం నుంచి తరలించారు.
బైండ్ ఓవర్ కేసులు పెట్టి వైసిపి ఏజెంట్ అన్న అరెస్టు చేస్తే మహిళలు కుర్చుంటే మహిళలని చూడకుండా వారిపై అసభ్యకరంగా ప్రవర్తించి తరిమేశారు.అధికార మదంతో కూటమి నాయకులు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.
మీ దౌర్జన్యాలను చూస్తూ ఊరుకుండేది లేదు వైయస్సార్సీపి గట్టిగా బదులిస్తుంది.పన్నుకు పన్ను, తన్నుకు తన్ను, చెంప దెబ్బకు చెంప దెబ్బ, చెప్పు దెబ్బకు చెప్పు దెబ్బ చేసి చూపిస్తుందని ఘాటుగా స్పందించిన నరేన్ రెడ్డి.

ఈసీ తక్షణమే చర్యలు చేపట్టాలి: నరేన్
ఈసతక్షమే కమలాపురము ఆగస్టు (పున్నమి ప్రతినిధి) కమలాపురం వైయస్సార్ సిపి ఇన్ చార్జ్ నరేన్ రామాంజుల రెడ్డి కమలాపురం స్థానిక పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పులివెందుల, ఒంటిమిట్టలో నిన్న జరిగిన జడ్పిటిసి ఉప ఎన్నికలు కూటమి ప్రభుత్వం ఆప్రజాస్వామికంగా నిర్వహించింది. బై ఎలక్షన్ లను సభ్య సమాజం తలదించుకునేలా కూటమి ప్రభుత్వం ప్రవర్తించింది. కూటమి ప్రభుత్వం మొదటి సంవత్సరంలో ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసింది. రెండవ సంవత్సరంలో తల్లికి వందనం అంటూ కొంతమందికే ఇచ్చి చేయి దులుపుకుంది.కూటమి ప్రభుత్వానికి ప్రజల్లోకి పోయి ఓట్లు అడిగే దమ్ము ధైర్యం లేక ప్రజలను భయభ్రాంతులను గురిచేసింది.రోజుకో ఒకరిపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేసినా వైసిపి నాయకులు ధైర్యంగా పోరాడారు.పులివెందుల, ఒంటిమిట్టలో 30 పోలింగ్ బూతులు, 35 వేల మంది ఓటర్లు ఉండగా 15 వేల మంది పోలీసులు నియమించడంలో అంతర్యం ఏమిటి. ఎవరిని చూసి ఎవరు భయపడుతున్నారో తెలియజేయాలి. ఒంటిమిట్ట కడప డివిజన్ ఎస్పీ పరిధిలో ఉంటే అన్నమయ్య జిల్లా ఎస్పీ వచ్చి విధులు నిర్వహిస్తూ అక్కడి ఎస్ఐలను సీఐలను పోలీసులను తెచ్చి రిగ్గింగ్ కు కీలక పాత్ర పోషించారు. బూతుల్లో ఉన్న అధికారులు కూడా కూటమి ప్రభుత్వానికి సహకరించారు. వీరిపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్. పులివెందులలో ఓటింగ్ జరుగుతుంటే కమలాపురం ఓటర్లకు అక్కడ ఏం పని. ఓట్లు వేశామని సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో చక్కర్లు కొలుతుంటే పోలీసు వ్యవస్థ ఏమి చేస్తుంది. పులివెందులలో దొంగ ఓట్లు వేయడానికి కూడా టిడిపి కి దిక్కులేక పక్క నియోజకవర్గం నుంచి తరలించారు. బైండ్ ఓవర్ కేసులు పెట్టి వైసిపి ఏజెంట్ అన్న అరెస్టు చేస్తే మహిళలు కుర్చుంటే మహిళలని చూడకుండా వారిపై అసభ్యకరంగా ప్రవర్తించి తరిమేశారు.అధికార మదంతో కూటమి నాయకులు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. మీ దౌర్జన్యాలను చూస్తూ ఊరుకుండేది లేదు వైయస్సార్సీపి గట్టిగా బదులిస్తుంది.పన్నుకు పన్ను, తన్నుకు తన్ను, చెంప దెబ్బకు చెంప దెబ్బ, చెప్పు దెబ్బకు చెప్పు దెబ్బ చేసి చూపిస్తుందని ఘాటుగా స్పందించిన నరేన్ రెడ్డి.

