పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా అక్టోబర్ 13
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా శతజయంతి ఉత్సవాలు 2025 సందర్భంగా నాగర్ కర్నూల్ శ్రీ సాయి ప్రశాంతి చారిటబుల్ సేవా ట్రస్ట్ మరియు సత్యసాయి సేవా సమితి వారి ఆధ్వర్యంలో మహిళలకు 45 రోజుల పాటు ఉచితంగా లేడీస్ టైలరింగ్,జ్యూట్ బ్యాగుల తయారీ మరియు మగ్గం వర్క్స్, జ్యూట్ బ్యాగుల తయారీ లపై వేరువేరుగా ప్రత్యేకంగా నాగర్ కర్నూలు సత్యసాయి మందిరంలో ఈనెల 23 నుండి శిక్షణ ఇవ్వనున్నట్లు సత్యసాయి సేవా సమితి కన్వీనర్ హకీం విశ్వప్రసాద్, శ్రీ సాయి ప్రశాంతి చారిటబుల్ సేవా ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి ఎలిమే ఈశ్వరయ్యలు తెలిపారు.
మహిళలు దరఖాస్తు చేసుకునేవారు కనీసం చదవడం, వ్రాయడం వచ్చి ఉండాలని అన్నారు. శిక్షణ మహిళా శిక్షకురాలుచే ప్రత్యేకంగా నాగర్ కర్నూల్ సత్యసాయి మందిరం ఆవరణలో శిక్షణా తరగతులు లేడీస్ వస్త్రాల తయారీ (టైలరింగ్), జ్యూట్ బ్యాగుల తయారీ కుట్టుట నేర్పుట, మరియు మగ్గం వర్క్, జ్యూట్ బ్యాగుల తయారీ కుట్టుట నేర్పుటలలో వేరువేరుగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.శిక్షణ సమయంలో భోజన, నివాస వసతి సత్యసాయి మందిరంలో కల్పించనున్నట్లు తెలిపారు. శిక్షణ పొందుటకు మహిళలు ఈనెల 22 బుధవారం వరకు ఒక ఫోటో, ఆధార్ కార్డు జిరాక్స్ , వ్యక్తిగత సెల్ నెంబర్ తో పాటు దరఖాస్తులు నాగర్ కర్నూల్ సత్యసాయి మందిరంలో అందజేయాలని సూచించారు.శిక్షణ తరగతులు ఈనెల 23 గురువారం నుండి ప్రారంభమగునని తెలిపారు. మరిన్ని వివరాలకు రంగారావు గారిని సాయి మందిరంలో నేరుగా లేదా సెల్ 6281412245 లేదా 9441303182 లలో సంప్రదించాలన్నారు.

ఈనెల 22 వరకు సత్యసాయి ఉచిత టైలరింగ్,మగ్గం వర్క్, జ్యూట్ బ్యాగుల తయారీ శిక్షణకు మహిళలు దరఖాస్తు చేసుకోవలెను
పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా అక్టోబర్ 13 భగవాన్ శ్రీ సత్య సాయి బాబా శతజయంతి ఉత్సవాలు 2025 సందర్భంగా నాగర్ కర్నూల్ శ్రీ సాయి ప్రశాంతి చారిటబుల్ సేవా ట్రస్ట్ మరియు సత్యసాయి సేవా సమితి వారి ఆధ్వర్యంలో మహిళలకు 45 రోజుల పాటు ఉచితంగా లేడీస్ టైలరింగ్,జ్యూట్ బ్యాగుల తయారీ మరియు మగ్గం వర్క్స్, జ్యూట్ బ్యాగుల తయారీ లపై వేరువేరుగా ప్రత్యేకంగా నాగర్ కర్నూలు సత్యసాయి మందిరంలో ఈనెల 23 నుండి శిక్షణ ఇవ్వనున్నట్లు సత్యసాయి సేవా సమితి కన్వీనర్ హకీం విశ్వప్రసాద్, శ్రీ సాయి ప్రశాంతి చారిటబుల్ సేవా ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి ఎలిమే ఈశ్వరయ్యలు తెలిపారు. మహిళలు దరఖాస్తు చేసుకునేవారు కనీసం చదవడం, వ్రాయడం వచ్చి ఉండాలని అన్నారు. శిక్షణ మహిళా శిక్షకురాలుచే ప్రత్యేకంగా నాగర్ కర్నూల్ సత్యసాయి మందిరం ఆవరణలో శిక్షణా తరగతులు లేడీస్ వస్త్రాల తయారీ (టైలరింగ్), జ్యూట్ బ్యాగుల తయారీ కుట్టుట నేర్పుట, మరియు మగ్గం వర్క్, జ్యూట్ బ్యాగుల తయారీ కుట్టుట నేర్పుటలలో వేరువేరుగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.శిక్షణ సమయంలో భోజన, నివాస వసతి సత్యసాయి మందిరంలో కల్పించనున్నట్లు తెలిపారు. శిక్షణ పొందుటకు మహిళలు ఈనెల 22 బుధవారం వరకు ఒక ఫోటో, ఆధార్ కార్డు జిరాక్స్ , వ్యక్తిగత సెల్ నెంబర్ తో పాటు దరఖాస్తులు నాగర్ కర్నూల్ సత్యసాయి మందిరంలో అందజేయాలని సూచించారు.శిక్షణ తరగతులు ఈనెల 23 గురువారం నుండి ప్రారంభమగునని తెలిపారు. మరిన్ని వివరాలకు రంగారావు గారిని సాయి మందిరంలో నేరుగా లేదా సెల్ 6281412245 లేదా 9441303182 లలో సంప్రదించాలన్నారు.

