9 బంగారు పతకాలు
4 కాంస్య పతకాలు
2 రజిత పతకాలు
నెల్లూరు : ఈ నెల 19 , 20 తేదీల్లో చిత్తూరులో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్-19 బాల, బాలికల స్కూల్ గేమ్స్ ఈత పోటీల్లో నెల్లూరు జిల్లాకు పతకాల పంట పండిందని నెల్లూరు స్కూల్ గేమ్స్ సెక్రటరీ వేణుగోపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.బాలుర జట్టులో సాయి ధీరజ్ , కే ఎన్ ఎస్ చరణ్ కుమార్ రెడ్డి , త్రినాద్ లు మూడు బంగారు పతకాలు గెలవగా , వచన్ , నివిద్ , సాయిప్రదీప్ లు మూడు కాంస్య పతకాలు ఒక రజిత పతకం సాధించారు .అదేవిధంగా బాలికల జట్టులో గోపీచందన రజిత పతకం గెలుపొందగా శ్రీజ కాంస్య పతకం సధించారు.ఈ జట్టులకు కోచ్గ్ గా నాగరాజు, మేనేజర్‌గా శ్రీధర్ , టోర్నమెంట్ అబ్జర్వర్లుగా ప్రభాకర్ రెడ్డి , సనత్ కుమార్ లు వ్యవహరించారు.


