రామారెడ్డి, నవంబర్ 21:
రామారెడ్డి మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు లాగాల ప్రసాద్ మాట్లాడుతూ ఇసుక మాఫియాపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఇందిరమ్మ పేరిట ఇసుక మాఫియా విచ్చలవిడిగా కొనసాగుతుందని, ఈ క్రమంలో కొందరు వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ పేరును వాడుతూ, పార్టీ ఇమేజ్‌కి మచ్చ తెస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని కాపాడే బదులు, తమ వ్యక్తిగత లాభాల కోసం వర్గాలు సృష్టిస్తూ పార్టీకి నష్టం కలిగించే చర్యలు కొందరు నేతలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.ఇలాంటి వారిని కాంగ్రెస్ పార్టీ పెద్దలు సీరియస్‌గా పరిగణిం చాలని, వెంటనే విచారణ జరిపి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని లాగాల ప్రసాద్ డిమాండ్ చేశారు. ప్రజలు, కార్యకర్తలు మదన్ మోహన్ నాయకత్వానికి అండగా నిలవాలని కోరుతూ “జై మదన్ అన్న – జై కాంగ్రెస్” నినాదాలు నినదించారు.


