కామారెడ్డి, 12 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) :
ఇసన్నపల్లి గ్రామంలో ఇంత ఘోరమా? అని చర్చించుకుంటున్నారు గ్రామస్తులు, కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం ఇస్న్నపల్లి గ్రామం 19 పంచాయతీల్లో ఒకటి. గ్రామపంచాయి తీ ఇమెయి ల్: gpissannapally@gmail.com, ఫోన్: 9347995602. వైకుంఠ ధామం, కంపోస్ట్ షెడ్ ఉన్నా ప్రాథమిక సదుపాయాలు లోపం, డ్రైనేజీ దుస్థితి రోడ్ల ఇరువైపులా డ్రైనేజీలు ఉన్నా మురికి పీదకలు కారణంగా నీరు రోడ్లపైనే ప్రవహి స్తోంది. మహిళలు బట్టలు ఉతకడం, మంచి నీరు తీసుకు వెళ్లాల్సి వచ్చింది. ఇది ఆరోగ్య సమస్యలకు దారి తీస్తోంది.వాటర్ పైప్ లీకేజీలు కాలనీల్లో వాటర్ పైప్లైన్‌లకు క్యాపులు లేకుండా ఘోరంగా నీరు ప్రవహిస్తోంది.ఈ లీకేజీలు డ్రైనేజీ సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. తాగునీరు వృథా అవుతూ గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. పంచాయతీ సిబ్బంది వైఖరి గ్రామ పంచాయతీ సిబ్బంది ఈ లీకేజీలను అదుపు చేయలేకపోతు న్నారు.ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోవట్లే దు. “ఏం చేస్తున్నారు?” అని గ్రామస్తులు ఆరోపిస్తు న్నారు.అధికారులపై ఒత్తిడి మండలాధికారి నాగేశ్వరావు, జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే మధన్ మోహన్ దృష్టికి తీసుకువెళ్ళాలని గ్రామస్తులు చెబుతున్నారు. పంచాయతీ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కథనం ప్రచురితమైన వెంటనే అధికారులు చర్యలు తీసుకుంటారని ఆశపడుతు న్నారు. గ్రామస్తులు తక్షణ పరిష్కారాలు పైప్లైన్‌ల కు క్యాపులు వేసి మరమ్మత్తులు చేయాలి. డ్రైనేజీ లు శుభ్రం చేసి రోడ్లు పట్టించాలి. గ్రామ సభలో చర్చించి బడ్జెట్ కేటాయించాలి. అధికారులు వెంట నే స్పందించాలి. జిల్లా అధికారులు వెంటనే ఇస్స న్నపల్లి గ్రామాన్ని సందర్శించి పరిస్థితులు చక్కది ద్దాలని వేడుకుంటున్నారు.


