ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 78 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
ఇబ్రహీంపట్నం, జనవరి 20 : ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 22 అభివృద్ధి పనులను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఇబ్రహీంపట్నం చెరువు కట్టపై గల కట్ట మైసమ్మ ఆలయం వద్ద నిర్మిస్తున్న ప్రత్యేక పూజలు చేసి అక్కడ నిర్మిస్తున్న ఆలయ షెడ్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఇబ్రహీంపట్నం చెరువు కట్ట సుందరీకరణ 18 కోట్ల రూపాయలతో పనులను, ఇబ్రహీంపట్నం నుండి నాగన్ పల్లి రోడ్డు వరకు నాలుగు లైన్ ల రోడ్డు పనులకు 60 కోట్ల రూపాయలతో నిర్మించే రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… గతంలో బిఆరఎస్ ప్రభుత్వ పాలనలో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న విధంగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు సంవత్సరాల కాలంలోనే 200 కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని రాష్ట్రంలో ఆదర్శ మున్సిపాలిటీగా మార్చడానికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నామన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో గల సబ్ రిజిస్టర్ కార్యాలయం
ఇక్కడే ఉంటుందని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ రిజిస్టర్ కార్యాలయాలు ప్రారంభిస్తున్న తరుణంలో సబ్ రిజిస్టర్ కార్యాలయాలు రిజిస్టర్ కార్యాలయానికి అనుసందంగా పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మల్ రెడ్డి అభిషేక్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి మైపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ కంబాలపల్లి గురునాథ్ రెడ్డి, వైస్ చైర్మన్ మంకాల కర్ణాకర్, పిఎసిఎస్ చైర్మన్ పాండురంగారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈసి శేఖర్ గౌడ్, జడల రవీందర్ రెడ్డి, ముత్యాల రాజశేఖర్ రావు, కప్పరి చందు, జలమోని రవీందర్ ముదిరాజ్, చెనమోని యాదగిరి, పప్పె శ్రీను, ఇందూరి శ్రీనివాస్, శశిధరప్ప, మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.



