Monday, 23 March 2026
  • Home  
  • ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని ఒకే పోలీస్ కమీషనరేట్ పరిధిలోకి తేవాలి
- E-పేపర్

ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని ఒకే పోలీస్ కమీషనరేట్ పరిధిలోకి తేవాలి

ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని ఒకే పోలీస్ కమీషనరేట్ పరిధిలోకి తేవాలి రంగారెడ్డి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్: పున్నమి న్యూస్ ప్రతినిధి : 14 జనవరి 2026 ముఖ్యమంత్రి , డిజిపి కి నివేదించిన మంచిరెడ్డి* ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని పోలీస్ స్టేషన్లను ఒకే పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు , మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రభుత్వానికి నివేదించారు.ఈమేరకు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , డిజిపి బత్తుల శివధర్ రెడ్డి కి లేఖ రాశారు. 1. ఫార్మా సిటీ పోలీస్ స్టేషన్ ను మేడిపల్లి లేదా కుర్మిద్ద గ్రామాలలో ఏర్పాటు చేయాలి , దీనిని మహేశ్వరం ఎసిపి పరిధిలోకి మార్చకుండా ఇబ్రహీంపట్నం ఎసిపి పరిధిలోనే కొనసాగించాలి. 2. అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ ను వనస్థలిపురం ఎసిపి పరిధి నుండి మినహాయించి ఇబ్రహీంపట్నం ఎసిపి పరిధిలోకి తేవాలి. 3. ⁠ఆదిభట్ల పోలీస్ స్టేషన్ ను హైదరాబాద్ కమీషనరేట్ లో చేర్చడం సరికాదు , ఫ్యూచర్ సిటీ కమీషనరేట్ పరిధిలోనే కొనసాగించాలి. 4. ⁠ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ కార్యాలయాన్ని కుర్మిద్ద , మేడిపల్లి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసేవిదంగా చర్యలు తీసుకోవాలని కోరారు. నియోజకవర్గ ప్రజల అభీష్టం మేరకే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. భవదీయ *సత్తు వెంకటరమణారెడ్డి ,* జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ , రంగారెడ్డి జిల్లా

ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని ఒకే పోలీస్ కమీషనరేట్ పరిధిలోకి తేవాలి

రంగారెడ్డి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్:
పున్నమి న్యూస్ ప్రతినిధి :
14 జనవరి 2026

ముఖ్యమంత్రి , డిజిపి కి నివేదించిన మంచిరెడ్డి*
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని పోలీస్ స్టేషన్లను ఒకే పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు , మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రభుత్వానికి నివేదించారు.ఈమేరకు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , డిజిపి బత్తుల శివధర్ రెడ్డి కి లేఖ రాశారు.
1. ఫార్మా సిటీ పోలీస్ స్టేషన్ ను మేడిపల్లి లేదా కుర్మిద్ద గ్రామాలలో ఏర్పాటు చేయాలి , దీనిని మహేశ్వరం ఎసిపి పరిధిలోకి మార్చకుండా ఇబ్రహీంపట్నం ఎసిపి పరిధిలోనే కొనసాగించాలి.
2. అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ ను వనస్థలిపురం ఎసిపి పరిధి నుండి మినహాయించి ఇబ్రహీంపట్నం ఎసిపి పరిధిలోకి తేవాలి.
3. ⁠ఆదిభట్ల పోలీస్ స్టేషన్ ను హైదరాబాద్ కమీషనరేట్ లో చేర్చడం సరికాదు , ఫ్యూచర్ సిటీ కమీషనరేట్ పరిధిలోనే కొనసాగించాలి.
4. ⁠ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ కార్యాలయాన్ని కుర్మిద్ద , మేడిపల్లి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసేవిదంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
నియోజకవర్గ ప్రజల అభీష్టం మేరకే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
భవదీయ
*సత్తు వెంకటరమణారెడ్డి ,*
జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ ,
రంగారెడ్డి జిల్లా

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.