సెప్టెంబర్ 30 (పున్నమి ప్రతినిధి)
గుడ్ న్యూస్.. ఇక మీ గ్యాస్ కనెక్షన్‌ను సిమ్లాగా పోర్ట్ చేసుకోవచ్చు!
వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త. మొబైల్ నంబర్ పోర్టబిలిటీ తరహాలో త్వరలో LPG కనెక్షన్లను కూడా మరో కంపెనీకి మార్చుకోవడానికి అనుమతించే “LPG ఇంటర్ఆపరబిలిటీ”పై పెట్రోలియం, సహజ వాయువు నియంత్రణ బోర్డు (PNGRB) ఒక ముసాయిదాను సిద్ధం చేసింది. దీనిపై వినియోగదారులు, పంపిణీదారుల నుండి సూచనలు కోరింది. 2013లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ విధానం, అప్పట్లో డీలర్‌ను మార్చుకునే పరిమిత అవకాశాలను ఇచ్చింది. ఇప్పుడు కంపెనీల మధ్య పోర్టబిలిటీని పరిశీలిస్తోంది. ఈ మేరకు పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ.. పెరుగుతున్న వినియోగదారుల సంఖ్యకు అనుగుణంగా సేవలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.


