పువ్వాడ నాగేంద్ర కుమార్
(ఖమ్మం పున్నమి స్టాఫ్ రిపోర్టర్ )
పెనుబల్లి (V. M. బంజర్ )
తెలంగాణ రాష్ట్ర ము లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లకు కేంద్ర ప్రభుత్వం అయినా బీజేపీ ప్రధాని మోదీ డబ్బులు విడుదల చేస్తున్నారని బీజేపీ ఖమ్మం జిల్లా అధికార ప్రతినిధి పడి గల మధు సుధన్ రావు అన్నారు. సోమవారం పున్నమి ప్రతి నిధి తో మాట్లాడుతూ
మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో 4కోట్ల ఇల్లులేని పేదలకు ఇల్లు కట్టించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కుట్రతో ఇందిరమ్మ పేరు పెట్టినా మోదీ ప్రభుత్వం ప్రతీ ఇంటికి 1.11 లక్షలు ఇస్తున్నది. దాంతోపాటు ఇంకో 15వేల రూపాయలు ఆదా అయ్యేందుకు సిమెంట్, స్టీల్ పై జీఎస్టీ తగ్గించి మేలు చేసింది. అంటే ప్రతీ పేద ఇంటికి మోదీ ఇప్పటికే 1.26లక్షలు ఇస్తున్నట్టు, అంతే కాకుండా మధ్యతరగతి వారికి హోమ్ లోన్ ఇంట్రెస్ట్ పై సబ్సిడీ (CLSS పథకం) కూడా ఇస్తున్నది మోదీ ప్రభుత్వం.
గ్రామానికి రోడ్డు – పీఎం సడక్ యోజన
గ్రామంలో టాయిలెట్ – పీఎం స్వచ్ఛభారత్
గ్రామంలో బల్బులు – పీఎం LED
గ్రామంలో రైతువేదిక, వైకుంఠధామం, హరితహారం – గ్రామీణ ఉపాధి నిధులు
గ్రామంలో విద్య – నవోదయ, పీఎం శ్రీ పాఠశాలలు
గ్రామంలో రూరల్ లైవ్లీ హుడ్ – మహిళా పొదుపు సంఘాలకు 20లక్షల రుణం
ఇలాంటి అనేక పథకాలతో గ్రామీణ భారతాన్ని వికసిత భారత్ వైపు నడిపిస్తున్నది మోదీప్రభుత్వం అని మధు అన్నారు.రాబోయే స్థానిక సంస్థ ల ఎన్నిక లలో బీజేపీ గెలిపించాలీ అని పడిగల మధు సుధన్ రావు ప్రజలకి విజ్ఞప్తి చేసారు.


