పున్నమి,తెలంగాణ బ్యూరో:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసింది. ప్రతి ఇంటి నిర్మాణంలో ఉపాధి పథకం కింద 90 రోజులపాటు పనులు నిర్వహించేందుకు అనుమతిస్తూ పంచాయతీరాజ్ శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉపాధి కూలీకి రోజుకు రూ.307 వేతనం ఇస్తున్నారు. 90 రోజులకు గాను వారికి రూ.27,630 వరకు ప్రయోజనం కలగనుంది. బేస్మెంట్ స్థాయి నిర్మాణం వరకు 40 రోజులు, స్లాబ్ నిర్మాణం వరకు 50 పని దినాల్లో నిబంధనల మేరకు పని చేయవచ్చు.


