ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. పరీక్షకు 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి*
తెలంగాణ ఇంటర్ బోర్డు విద్యార్థులకు శుభవార్త చెప్పింది.
ఫిబ్రవరి 25 నుంచి మొదలయ్యే ఇంటర్ పబ్లిక్ పరీక్షల వేళ అమలు చేసే ‘ఒక్క నిమిషం ఆలస్యం’ నిబంధనను సవరించింది.
ఇకపై పరీక్షలకు ఐదు నిమిషాల ఆలస్యమైనా అనుమతిస్తారని తెలిపింది.
ఈ పరీక్షలకు మొత్తం 10 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరుకానున్నారు.
ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2 నుంచి మొదలవుతాయి.
హాల్ టికెట్లపై QR కోడ్ తో పరీక్ష కేంద్రాలకు సులభంగా చేరుకోవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది.



