Sunday, 7 December 2025
  • Home  
  • ఆ భూమి న్యాయంగానే కొన్నాం.. మాకు న్యాయం చేయండి
- నాగర్‌కర్నూల్

ఆ భూమి న్యాయంగానే కొన్నాం.. మాకు న్యాయం చేయండి

ఆ భూమిని న్యాయంగానే కొన్నాము. మాకు న్యాయం చేసి ఆక్రమణదారుల నుంచి మా భూమి దక్కేలా చూడండి అని బాధితురాలు మంచుకొండ హైమావతి కోరారు. సోమవారం మండల పరిధిలోని కొట్ర చౌరస్తా వద్ద దివంగత జైపాల్ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి ఆమె నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హైమావతి మాట్లాడుతూ వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామ పరిధిలోని గొల్లోనిపల్లిలో సర్వేనంబర్లు 237, 238లోని 10 ఎకరాలు 6 గుంటల పొలాన్ని 2006లో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నామని తెలిపారు. తప్పుడు పత్రాలు సృష్టించలేదని, తన భర్త పేరు పై ఉన్న అన్ని పత్రాలు, పాసుబుక్కులు సక్రమంగానే ఉన్నాయని వివరించారు. అయితే 2020లో తన భర్త వీరేశం గుండెపోటుతో మరణించాడని, ఆ తర్వాత కొన్నాళ్లకు తమ భూమిని రైతులు హద్దులు చూపించారని తెలిపారు. అప్పటి నుంచి ఆ పట్టా పొలాన్ని తన పేరు పై మార్పిడి చేయాలంటూ పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, ఇప్పటివరకు న్యాయం జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోవడంతో అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు రైతులతో కలిసి తమ భూమి పై కన్నేశారని ఆరోపించారు. భర్త లేనందున తాను ఏమీ చేయలేనని భావించి భూమి కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఆక్రమణకు పాల్పడుతున్న వారి పై చట్టప్రకారం చర్యలు తీసుకుని, తమ భూమి తిరిగి తమకు దక్కేలా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని హైమావతి విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆ గ్రామ రైతులు, నాయకులు మాట్లాడుతూ ఆ భూమి మంచుకొండ వీరేశం కొనుగోలు చేసినదే, అందువల్ల హైమావతికే చెందుతుందని పేర్కొన్నారు. ఆమెకు అండగా నిలబడి, న్యాయం జరిగేంత వరకు వెన్నంటి ఉంటామని తెలిపారు.

ఆ భూమిని న్యాయంగానే కొన్నాము. మాకు న్యాయం చేసి ఆక్రమణదారుల నుంచి మా భూమి దక్కేలా చూడండి అని బాధితురాలు మంచుకొండ హైమావతి కోరారు. సోమవారం మండల పరిధిలోని కొట్ర చౌరస్తా వద్ద దివంగత జైపాల్ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి ఆమె నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హైమావతి మాట్లాడుతూ వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామ పరిధిలోని గొల్లోనిపల్లిలో సర్వేనంబర్లు 237, 238లోని 10 ఎకరాలు 6 గుంటల పొలాన్ని 2006లో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నామని తెలిపారు. తప్పుడు పత్రాలు సృష్టించలేదని, తన భర్త పేరు పై ఉన్న అన్ని పత్రాలు, పాసుబుక్కులు సక్రమంగానే ఉన్నాయని వివరించారు. అయితే 2020లో తన భర్త వీరేశం గుండెపోటుతో మరణించాడని, ఆ తర్వాత కొన్నాళ్లకు తమ భూమిని రైతులు హద్దులు చూపించారని తెలిపారు.
అప్పటి నుంచి ఆ పట్టా పొలాన్ని తన పేరు పై మార్పిడి చేయాలంటూ పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, ఇప్పటివరకు న్యాయం జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోవడంతో అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు రైతులతో కలిసి తమ భూమి పై కన్నేశారని ఆరోపించారు. భర్త లేనందున తాను ఏమీ చేయలేనని భావించి భూమి కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఆక్రమణకు పాల్పడుతున్న వారి పై చట్టప్రకారం చర్యలు తీసుకుని, తమ భూమి తిరిగి తమకు దక్కేలా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని హైమావతి విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆ గ్రామ రైతులు, నాయకులు మాట్లాడుతూ ఆ భూమి మంచుకొండ వీరేశం కొనుగోలు చేసినదే, అందువల్ల హైమావతికే చెందుతుందని పేర్కొన్నారు. ఆమెకు అండగా నిలబడి, న్యాయం జరిగేంత వరకు వెన్నంటి ఉంటామని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.