Monday, 23 March 2026
  • Home  
  • ఆసియాలో తొలి మహిళా లోకోపైలట్ సురేఖా యాదవ్ పదవీ విరమణ
- E-పేపర్

ఆసియాలో తొలి మహిళా లోకోపైలట్ సురేఖా యాదవ్ పదవీ విరమణ

భారతీయ రైల్వే చరిత్రలో మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలిచిన మహారాష్ట్రకు చెందిన సురేఖా యాదవ్ గారు పదవీ విరమణ పొందారు. 1988లో అసిస్టెంట్ లోకోపైలట్గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన సురేఖా యాదవ్, అనేక అడ్డంకులను అధిగమించి ఆసియా ఖండంలో తొలి మహిళా లోకోపైలట్గా రైలు నడిపిన సాహస స్వరూపిణి. డెక్కన్ క్వీన్ సహా ప్రముఖ రైళ్లను నడిపిన ఆమె, నాలుగు దశాబ్దాల ఉద్యోగ జీవితం ద్వారా రైల్వేలో ఒక కొత్త ప్రమాణాన్ని నెలకొల్పారు. తన కష్టసాధ్యమైన కృషి, పట్టుదల, అంకితభావం ద్వారా అణచివేతల ఉక్కుపాదాలను అధిగమించి ఒక కొత్త మార్గాన్ని చూపిన ఆమె, అనేకమంది మహిళలకు జీవన మార్గదర్శకురాలిగా నిలిచారు. సురేఖా యాదవ్ గారి విశిష్టమైన సేవలు భారతీయ రైల్వే చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయి.

భారతీయ రైల్వే చరిత్రలో మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలిచిన మహారాష్ట్రకు చెందిన సురేఖా యాదవ్ గారు పదవీ విరమణ పొందారు.

1988లో అసిస్టెంట్ లోకోపైలట్గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన సురేఖా యాదవ్, అనేక అడ్డంకులను అధిగమించి ఆసియా ఖండంలో తొలి మహిళా లోకోపైలట్గా రైలు నడిపిన సాహస స్వరూపిణి. డెక్కన్ క్వీన్ సహా ప్రముఖ రైళ్లను నడిపిన ఆమె, నాలుగు దశాబ్దాల ఉద్యోగ జీవితం ద్వారా రైల్వేలో ఒక కొత్త ప్రమాణాన్ని నెలకొల్పారు.

తన కష్టసాధ్యమైన కృషి, పట్టుదల, అంకితభావం ద్వారా అణచివేతల ఉక్కుపాదాలను అధిగమించి ఒక కొత్త మార్గాన్ని చూపిన ఆమె, అనేకమంది మహిళలకు జీవన మార్గదర్శకురాలిగా నిలిచారు.

సురేఖా యాదవ్ గారి విశిష్టమైన సేవలు భారతీయ రైల్వే చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.