సెప్టెంబర్ 22 పున్నమి ప్రతినిధి @దుబాయ్ : దాయాది జట్టు పాకిస్థాన్ పై భారత జట్టు అదిరే ప్రదర్శన చేసింది. ఆసియాకప్ సూపర్-4లో పాకిస్తాను భారత్ 6 వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత పాక్ 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఆ జట్టులో ఓపెనర్ సాహిబాజాదా ఫర్హాన్ (58) అర్ధశతకం చేశాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్ 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (74: 39 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్ల, శుభ్మన్ గిల్ (47: 28 బంతుల్లో 8 ఫోర్లు) చెలరేగి ఆడారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ సిక్స్లు, ఫోర్లతో హోరెత్తించాడు. ఓపెనర్ల దూకుడైన ఆటతో తొలి వికెట్కు 105 పరుగుల భారీ భాగస్వామ్యం లభించింది. చివర్లో తిలక్ వర్మ (30*) రాణించాడు. సంజు శాంసన్ (13), హార్దిక్ (7*) పరుగులు చేశారు.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఆదిలోనే హార్దిక్ పాండ్య పాక్కు కళ్లెం వేశాడు.
మూడో ఓవర్లో శాంసన్కు క్యాచ్ ఇచ్చి ఓపెనర్ ఫకార్ జమాన్ వెనుదిరిగాడు. వనౌన్లో వచ్చిన అయూబ్తో కలిసి మరో ఓపెనర్ ఫర్హాన్ (58; 45 బంతుల్లో 5×4, 3×6) ఇన్నింగ్స్ను నిర్మించాడు. రెండో వికెట్కు వీరిద్దరూ కలిసి 93 పరుగులు జోడించారు. 11వ ఓవర్లో శివమ్ దూబె బౌలింగ్లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి అయూబ్ పెవిలియన్ బాట పట్టాడు. అక్కడికి స్వల్ప వ్యవధిలోనే తలత్ (10) సైతం వెనుదిరిగాడు. ఓ వైపు వికెట్లు కోల్పోతున్నా.. ఫర్హాన్ మాత్రం క్రీజులో నిలదొక్కుకుంటూ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. జట్టు స్కోరు 115 పరుగుల వద్ద సూర్యకుమార్ యాదవ్ కు క్యాచ్ ఇచ్చి ఫర్హాన్ ఔటయ్యాడు.
మూడో ఓవర్లో శాంసన్కు క్యాచ్ ఇచ్చి ఓపెనర్ ఫకార్ జమాన్ వెనుదిరిగాడు. వనౌన్లో వచ్చిన అయూబ్తో కలిసి మరో ఓపెనర్ ఫర్హాన్ (58; 45 బంతుల్లో 5×4, 3×6) ఇన్నింగ్స్ను నిర్మించాడు. రెండో వికెట్కు వీరిద్దరూ కలిసి 93 పరుగులు జోడించారు. 11వ ఓవర్లో శివమ్ దూబె బౌలింగ్లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి అయూబ్ పెవిలియన్ బాట పట్టాడు. అక్కడికి స్వల్ప వ్యవధిలోనే తలత్ (10) సైతం వెనుదిరిగాడు. ఓ వైపు వికెట్లు కోల్పోతున్నా..ఫర్హాన్ మాత్రం క్రీజులో నిలదొక్కుకుంటూ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. జట్టు స్కోరు 115 పరుగుల వద్ద సూర్యకుమార్ యాదవ్ కు క్యాచ్ ఇచ్చి ఫర్హాన్ ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన నవాజ్ (21) రనౌట్గా వెనుదిరిగాడు. చివర్లో సల్మాన్, అప్రాఫ్ కీలక ఇన్నింగ్స్ ఆడటంతో పాక్ మంచి స్కోరే ఇచ్చిన 171 పరుగులు ను భరత్ 174 పరుగులతో విజయకేతానం ఎగారావేసింది.


