నకిరేకల్ : ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి )
నకిరేకల్ పట్టణంలో ఉన్న 30 పడకల ఆసుపత్రిలో రోగుల కోసం ఇప్పటివరకు కూడా పరిశుభ్రమైన వాటర్ లేక ఆసుపత్రికి వచ్చే రోగులు ఇబ్బంది పడ్డారు. వారికై ఎమ్మెల్యే వేముల వీరేశం గారు కృషి చేసి, ఎంపీ నిధులతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయించి, ఈరోజు ఆర్వో వాటర్
ప్లాంట్ ను భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించారు.
ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నకిరేకల్ పట్టణంలో 100 పడకల ఆసుపత్రి 95% పూర్తి అయినదని, త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు.


