రావులపాలెం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం ఆర్టీసీ బస్సు ఢీకొని ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామానికి చెందిన అడపాల కోటమ్మ (61) మృతి చెందింది. స్వగ్రామం వెళ్లేందుకు బస్టాండ్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఆమెను కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు

ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలి మృతి