Monday, 23 March 2026
  • Home  
  • ఆమ్ ఆద్మీ పార్టీ “జాడు చలావ్ యాత్ర”లో వై.ఎస్.ఆర్. కాలనీలో వెలుగులోకి వచ్చిన ముఖ్య సమస్యలు
- నిర్మల్

ఆమ్ ఆద్మీ పార్టీ “జాడు చలావ్ యాత్ర”లో వై.ఎస్.ఆర్. కాలనీలో వెలుగులోకి వచ్చిన ముఖ్య సమస్యలు

నిర్మల్ నవంబర్ 15 (పున్నమి ప్రతినిధి) నిర్మల్ జిల్లా నిర్మల్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో వై.ఎస్.ఆర్. కాలనీలో ‘జాడు చలావ్ యాత్ర’ విజయవంతంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు సయ్యద్ హైదర్ సహా నాయకులు ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీలో రోడ్లు దయనీయ స్థితిలో ఉండటం, డ్రైనేజీ లేమి, చెత్త కుప్పలు పేరుకుపోవడం, వరద ముంపు ప్రమాదం వంటి తీవ్రమైన మౌలిక సమస్యలు బయటపడ్డాయి. మురుగునీటి నిల్వ కారణంగా డెంగ్యూ–మలేరియా వంటి వ్యాధులు విస్తరించడంతో సుమారు 20 మంది బాధపడుతున్నారు. ఈ పరిస్థితిపై ఆప్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తూ, రోడ్ల మరమ్మతులు, శాశ్వత డ్రైనేజీ నిర్మాణం, పారిశుద్ధ్య చర్యలు, వీధి దీపాల ఏర్పాటు, ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం కోరుతూ జిల్లా అధికారులకు త్వరలోనే వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బైండ్ల శ్రీనివాస్, వినోద్ కుమార్, అబ్దుల్ సాదిక్, యాకిన్, షేక్ ఇమామ్, షేక్ హైమద్ తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్ నవంబర్ 15 (పున్నమి ప్రతినిధి)
నిర్మల్ జిల్లా నిర్మల్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో వై.ఎస్.ఆర్. కాలనీలో ‘జాడు చలావ్ యాత్ర’ విజయవంతంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు సయ్యద్ హైదర్ సహా నాయకులు ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీలో రోడ్లు దయనీయ స్థితిలో ఉండటం, డ్రైనేజీ లేమి, చెత్త కుప్పలు పేరుకుపోవడం, వరద ముంపు ప్రమాదం వంటి తీవ్రమైన మౌలిక సమస్యలు బయటపడ్డాయి. మురుగునీటి నిల్వ కారణంగా డెంగ్యూ–మలేరియా వంటి వ్యాధులు విస్తరించడంతో సుమారు 20 మంది బాధపడుతున్నారు. ఈ పరిస్థితిపై ఆప్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తూ, రోడ్ల మరమ్మతులు, శాశ్వత డ్రైనేజీ నిర్మాణం, పారిశుద్ధ్య చర్యలు, వీధి దీపాల ఏర్పాటు, ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం కోరుతూ జిల్లా అధికారులకు త్వరలోనే వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బైండ్ల శ్రీనివాస్, వినోద్ కుమార్, అబ్దుల్ సాదిక్, యాకిన్, షేక్ ఇమామ్, షేక్ హైమద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.