అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం రెడ్డిపల్లె చెరువు కట్ట వద్ద ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రైల్వే కోడూరు నియోజకవర్గం శెట్టిగుంట గ్రామానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కుటుంబ భారం మోసే వ్యక్తులు హఠాత్తుగా మరణించడంతో ఆ కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది.ఈ విషాద ఘటన నేపథ్యంలో, కుటమి ప్రభుత్వం బాధిత కుటుంబాలకు సాయం అందిస్తూ, ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున మొత్తం రూ.12 లక్షల పరిహారం మంజూరు చేసింది.రోడ్డు ప్రమాద బాధిత కుటుంబ సభ్యులైన గజ్జల శ్రీను, గజ్జల వెంకటేశ్వర్లు మరియు తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు సునీత, రాజేశ్వరి, గంగయ్య లకు పంపిణీ చేశారు.ఈ ఆర్థిక సహాయాన్ని అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ గారు మరియు రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో రాత్రి అధికారికంగా పంపిణీ చేశారు.ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ:
“ప్రభుత్వం ఎప్పటికీ ప్రజల పక్షాన నిలుస్తుంది. బాధిత కుటుంబాలను ఆదుకోవడం మన బాధ్యత. ఇలాంటి విషాద సంఘటనలు మరల జరగకూడదని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను” అని పేర్కొన్నారు.ప్రభుత్వ స్పందన పట్ల గ్రామస్తులు, బాధిత కుటుంబాలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన పరిహారం, తమ జీవితాన్ని తిరిగి సమతుల్యం చేయడానికి కొంతవరకైనా భరోసానిచ్చిందని వారు తెలిపారు.ఈ ఘటన కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన ఎలా నిలుస్తుందన్న దానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

ఆపద వేళ అండగా నిలిచిన ఎన్డీఏ కూటమి – ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ.12 లక్షల పరిహారం అందించిన కలెక్టర్ శ్రీధర్ , ఇంచార్జ్ కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి
అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం రెడ్డిపల్లె చెరువు కట్ట వద్ద ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రైల్వే కోడూరు నియోజకవర్గం శెట్టిగుంట గ్రామానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కుటుంబ భారం మోసే వ్యక్తులు హఠాత్తుగా మరణించడంతో ఆ కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది.ఈ విషాద ఘటన నేపథ్యంలో, కుటమి ప్రభుత్వం బాధిత కుటుంబాలకు సాయం అందిస్తూ, ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున మొత్తం రూ.12 లక్షల పరిహారం మంజూరు చేసింది.రోడ్డు ప్రమాద బాధిత కుటుంబ సభ్యులైన గజ్జల శ్రీను, గజ్జల వెంకటేశ్వర్లు మరియు తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు సునీత, రాజేశ్వరి, గంగయ్య లకు పంపిణీ చేశారు.ఈ ఆర్థిక సహాయాన్ని అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ గారు మరియు రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో రాత్రి అధికారికంగా పంపిణీ చేశారు.ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ: “ప్రభుత్వం ఎప్పటికీ ప్రజల పక్షాన నిలుస్తుంది. బాధిత కుటుంబాలను ఆదుకోవడం మన బాధ్యత. ఇలాంటి విషాద సంఘటనలు మరల జరగకూడదని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను” అని పేర్కొన్నారు.ప్రభుత్వ స్పందన పట్ల గ్రామస్తులు, బాధిత కుటుంబాలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన పరిహారం, తమ జీవితాన్ని తిరిగి సమతుల్యం చేయడానికి కొంతవరకైనా భరోసానిచ్చిందని వారు తెలిపారు.ఈ ఘటన కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన ఎలా నిలుస్తుందన్న దానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

