
ఆపద కాలంలో ఆపద్బాంధవులు మనుబోలు గ్రామ దాతలు
విపత్కర పరిస్థితుల్లో సేవా కార్యక్రమాలు
నివర్ తుఫాన్ లో దాతృత్వం చాటిన మానవత వాదులు
ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్న వాహనదారులు ఆకలి తీర్చిన సేవా మూర్తులు
వైసీపీ, జనసేనా, తెలుగుదేశం నేతలు దాతృత్వం స్ఫూర్తి దాయకం
మనుబోలు( పున్నమి విలేఖరి) 28,నవంబర్ :ప్రకృతి విపత్తులు సంభవించిన, తుఫాను, వరదలు వచ్చిన, కరోనా లాంటి మహమ్మారి విజృంభించిన పేద ప్రజలు, బాధితులకు అండగా నిలబడి అన్నీ విధాల సహాయ సహకారాలు అందించడంలో ముందుఉంటారు ప్రాంతాలు,భాషలు,మతాలు, కులాలు వంటివి చూడకుండా కేవలం మనుషులు గా మానవత మూర్తులుగా సేవలు అందించడం జరిగింది
నివర్ తుఫాను ప్రభావంతో గత మూడు రోజుల గా కురిసిన వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి, ఈ పరిస్థితులలో గూడూరు ఆదిశంకర కళాశాల జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహిస్తూ ఉండటం వల్ల గురువారం ఉదయం నుండి నెల్లూరు, చెన్నై మధ్య వాహన రాకపోకలు నిలిచిపోయాయి, దింతో వాహనాలు రోడ్డు పై బారులు తీరాయి, వర్షాలు కురవడంతో ఏక్కడ కూడా ఆహారం దొరకని పరిస్థితి, ఈ తరుణంలో ఆపద్బాంధవులు అయినా మనుబోలు దాతలు వెంటనే స్పందించి గురువారం రాత్రి నుండి వాహనదారులకు ఆహారం అందిస్తూ తమ దాతృత్వం చాటుతున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో
గూడూరు జాతీయ రహదారిపై నివర్ తుఫాన్ కారణంగా గురువారం నుండి జాతీయ రహదారిపై బారి సంఖ్యలో వాహనాలు నిలచి పోవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సహకారంతో అవస్థలు పడుతున్న ప్రయాణికులకు టీ,ఆహారం మంచినీరు అందించి తమ దాతృత్వం చాటారు,లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ మనుబోలుఎస్సీ బాయ్స్ హాస్టల్ బిసి గర్ల్స్ హాస్టల్ కు తరలించి వాళ్లందరికీ భోజన వసతి కల్పించారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొమ్మిరెడ్డి హర గోపాల్ రెడ్డి ,కడివెటి చంద్రశేఖర్ రెడ్డి,దాసరి భాస్కర్ గౌడ్, కిషోర్ నాయుడు ,ముంగర విజయ భాస్కర్ రెడ్డి ,చేరెడ్డి పట్టాభిరామిరెడ్డి ,దాసరి మహేంద్ర వర్మ ,భాస్కర్ రెడ్డి,సుధాకర్ రెడ్డి మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు.. 
తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో లో సేవలు*
_ నీవర్ తుఫాను కారణంగా గూడూరు జాతీయ రహదారిలో ట్రాఫిక్ జామ్ తో చిక్కుకొన్న ప్రయాణికులకు మనుబోలు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు టమాటా అన్నం అందజేసి తమ దాతృత్వం చాటారుఈ కార్యక్రమంలో నాయకులు పచ్చిపాల రామిరెడ్డి, కలికి రమేష్ రెడ్డి ,శివుడు రాజా ,సాని వెంకటరమణయ్య ,నల్ల గల వెంకయ్య తదితరులు పాల్గొన్నారు

జనసేనాఆధ్వర్యంలో
నివర్ తుఫాను కారణంగా గూడూరు- నెల్లూరు జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహించడం వల్ల జాతీయ రహదారిపై ట్రాఫిక్ చిక్కుకొని ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు జనసేన ఆధ్వర్యంలో రెండువందల మంది ప్రయాణికులకు వాహనదారులకు అల్పాహారం అందించడం జరిగింది మరియు మధ్యాహ్నం పొంగలి అందించడం జరిగింది . ఈ సందర్భంగా జనసేన, నాయకులు మాట్లాడుతూ జనసేన దృక్పథంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ లో చిక్కుకున్న ప్రయాణికులకు సహాయం అందించడం జరిగిందని తెలిపారు. సేవా కార్యక్రమాలకు సహకరించిన జన సైనికులు, మెగా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. తుఫాను సహాయక చర్యల్లో అధికారులకు మా సహకారం ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మెగా అభిమానులు శ్రీకాంత్ ,సందీప్ ,ఉదయ్ ,సురేష్, బాబు, పవన్ పాల్గొన్నారు.

