Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

ఆదినారాయణపురంలో ఘనంగా నూతన కాపుల పట్టాభిషేకం

Punnami Newsroom Published:
ఆదినారాయణపురంలో ఘనంగా నూతన కాపుల పట్టాభిషేకం

అల్లూరు, అక్టోబర్ 10: నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలోని ఆదినారాయణపురం గ్రామంలో నూతన కాపుల పట్టాభిషేక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కావలి మాజీ శాసనసభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) సభ్యులు శ్రీ కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర మాజీ ఆఫ్కాఫ్ చైర్మన్ శ్రీ కొండూరు అనిల్ బాబు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కాపులను ముఖ్య అతిథులు ఘనంగా సన్మానించారు. గ్రామ సంప్రదాయాలను కాపాడుతూ, ఐక్యత, పరస్పర సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేయడంలో కాపుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.
నూతనంగా ఎన్నికైన కాపులు వీరే!
పెద్దకాపు: బుచ్చంగారి నరసయ్య
నడికాపు: ఊటుకూరు నరసయ్య
చిన్నకాపు: కోడూరు సోమయ్య
క్యాషియర్: కొండూరు కసుమూర్
నూతనంగా ఎన్నికైన ఈ నలుగురు తమ బాధ్యతలను స్వీకరించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
ముఖ్య అతిథులకు ఘన సన్మానం
ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర మాజీ ఆఫ్కాఫ్ చైర్మన్ కొండూరు అనిల్ బాబులను నూతనంగా ఎన్నికైన కాపులు శాలువాలతో ఘనంగా సత్కరించి, కృతజ్ఞతలు తెలియజేశారు.గ్రామంలో సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ పట్టాభిషేక కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నూతనంగా ఎన్నికైన కాపులకు పలువురు గ్రామస్తులు శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామ ఐక్యతను కాపాడుతూ, గ్రామాభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

ఆదినారాయణపురంలో ఘనంగా నూతన కాపుల పట్టాభిషేకం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *