Sunday, 7 December 2025
  • Home  
  • ఆత్మ విశ్వాసంతో  వ్యాధుల పై విజయం
- Featured - ఆంధ్రప్రదేశ్

ఆత్మ విశ్వాసంతో  వ్యాధుల పై విజయం

ఆత్మ విశ్వాసంతో  వ్యాధుల పై విజయం (పున్నమి ప్రతినిధి ` డా॥ గంగిశెట్టి శివకుమార్‌) మహామంత్రి తిమ్మరుసు చిన్నతనంలో గురువు పలక మీద గీత గీసి, తుడపకుండా దాన్ని చిన్నది చేయమంటే దాని పక్కనే పెద్ద గీత గీశాడు. ఆటోమాటిగ్గా ముందున్న గీత చిన్నదై పోయింది. ప్రస్తుత ప్రపంచం ఉన్న పరిస్థితుల్లో ‘‘కరోనా’’ ఒక్కటే పెద్ద వ్యాధి అయింది. తదితర వ్యాధులన్నీ చిన్నవైపోయాయి. హాస్పిటల్స్‌, క్లీనిక్‌లు చాలా వరకు పనిచేయకపోయినా బాధపడేవారో, లేక ఇబ్బంది పడేవారో లేరు. డాక్టర్ల దగ్గరకు పోయే వారూ తగ్గిపోయారు. మందుల షాపు తెరచి వుండడంతో చాలా వరకు వారి చిన్నచిన్న ఆరోగ్య సమస్యల్ని మందుకొని పరిష్కరించుకుంటున్నారు. చిన్న చిన్న వ్యాధులకు టెన్షన్‌ పడడం తగ్గిపోయింది. తమ సహజ సిద్ధంగా  ఉన్న ‘రోగనిరోధక శక్తి’ మీద నమ్మకాన్ని పెంచుకున్నారు. దేశంలో ప్రతి చిన్న వ్యాధి నుంచి పెద్ద వ్యాధి దాకా చీటికి మాటికి కంగారెత్తిపోయి ఆసుపత్రులు చుట్టూ తిరిగే జనం లాక్‌డౌన్‌ సందర్భంగా బాగా ఇబ్బంది పడతారని విశ్లేషకులు అంచనావేశారు. అధిక సంఖ్యలో మరణాలు సంభవిస్తాయని ఆందోళన వెలిబుచ్చారు. కానీ లాక్‌డౌన్‌ మూడు వారాలు గడిచాక చూస్తే అలాంటి ఆందోళనకు అవకాశమే లేకుండా పోయింది. దేశంలో మరణాల రేటు ఏమీ పెరిగిన దాఖలాలు లేవు. మన దేశంలో మధ్యతరగతి వాళ్లు ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లడం మానేసి చాలా కామైంది. పూర్తిగా ప్రైవేటు, కార్పొరేట్‌ హాస్పిటళ్ల మీద ఆధారపడ్డారు. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేటు, కార్పొరేట్‌ హాస్పిటల్స్‌ అనవసరంగా  పరీక్షలు, స్కానింగ్‌ పేరిట పెద్ద ఎత్తున జనాన్ని దోపిడీ చేయడం ప్రారంభించారు. అయినా ప్రాణ భయంతో ప్రతిచిన్న ఆరోగ్య సమస్యకు వైద్యులను సంప్రదించడం, రోగుల వేలకు వేలు దారపోసుకోవడం జరుగుతూ వుండేది. కరోనా దెబ్బతో ఆ దోపిడీ వ్యాపారం వెనక్కుపోయింది. ఇంటి పట్టునే వుండడం, ప్రశాంతంగా వుండటం, వత్తిడి లేకుండా వుండటం, సరదాగా కుటుంబ సభ్యులతో గడపటం, టి.వి.లో కార్యక్రమాలు చూస్తూ వినోదించడం, చిన్నాచితకా ఆరోగ్య సమస్యలకు డాక్టర్‌ దగ్గరకు పోకుండా ప్రత్యామ్నాయ, సాంప్రదాయ వైద్యవిధానాలతో సరిపెట్టుకుంటున్నారు. లాక్‌డౌన్‌ అనంతరం కూడా ప్రజల్లో ఈ చైతన్యం కొనసాగాలని నిపుణులు కోరుకుంటున్నారు.

ఆత్మ విశ్వాసంతో  వ్యాధుల పై విజయం
(పున్నమి ప్రతినిధి ` డా॥ గంగిశెట్టి శివకుమార్‌)
మహామంత్రి తిమ్మరుసు చిన్నతనంలో గురువు పలక మీద గీత గీసి, తుడపకుండా దాన్ని చిన్నది చేయమంటే దాని పక్కనే పెద్ద గీత గీశాడు. ఆటోమాటిగ్గా ముందున్న గీత చిన్నదై పోయింది.
ప్రస్తుత ప్రపంచం ఉన్న పరిస్థితుల్లో ‘‘కరోనా’’ ఒక్కటే పెద్ద వ్యాధి అయింది. తదితర వ్యాధులన్నీ చిన్నవైపోయాయి. హాస్పిటల్స్‌, క్లీనిక్‌లు చాలా వరకు పనిచేయకపోయినా బాధపడేవారో, లేక ఇబ్బంది పడేవారో లేరు. డాక్టర్ల దగ్గరకు పోయే వారూ తగ్గిపోయారు. మందుల షాపు తెరచి వుండడంతో చాలా వరకు వారి చిన్నచిన్న ఆరోగ్య సమస్యల్ని మందుకొని పరిష్కరించుకుంటున్నారు. చిన్న చిన్న వ్యాధులకు టెన్షన్‌ పడడం తగ్గిపోయింది. తమ సహజ సిద్ధంగా  ఉన్న ‘రోగనిరోధక శక్తి’ మీద నమ్మకాన్ని పెంచుకున్నారు.
దేశంలో ప్రతి చిన్న వ్యాధి నుంచి పెద్ద వ్యాధి దాకా చీటికి మాటికి కంగారెత్తిపోయి ఆసుపత్రులు చుట్టూ తిరిగే జనం లాక్‌డౌన్‌ సందర్భంగా బాగా ఇబ్బంది పడతారని విశ్లేషకులు అంచనావేశారు. అధిక సంఖ్యలో మరణాలు సంభవిస్తాయని ఆందోళన వెలిబుచ్చారు. కానీ లాక్‌డౌన్‌ మూడు వారాలు గడిచాక చూస్తే అలాంటి ఆందోళనకు అవకాశమే లేకుండా పోయింది. దేశంలో మరణాల రేటు ఏమీ పెరిగిన దాఖలాలు లేవు.
మన దేశంలో మధ్యతరగతి వాళ్లు ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లడం మానేసి చాలా కామైంది. పూర్తిగా ప్రైవేటు, కార్పొరేట్‌ హాస్పిటళ్ల మీద ఆధారపడ్డారు. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేటు, కార్పొరేట్‌ హాస్పిటల్స్‌ అనవసరంగా  పరీక్షలు, స్కానింగ్‌ పేరిట పెద్ద ఎత్తున జనాన్ని దోపిడీ చేయడం ప్రారంభించారు. అయినా ప్రాణ భయంతో ప్రతిచిన్న ఆరోగ్య సమస్యకు వైద్యులను సంప్రదించడం, రోగుల వేలకు వేలు దారపోసుకోవడం జరుగుతూ వుండేది. కరోనా దెబ్బతో ఆ దోపిడీ వ్యాపారం వెనక్కుపోయింది.
ఇంటి పట్టునే వుండడం, ప్రశాంతంగా వుండటం, వత్తిడి లేకుండా వుండటం, సరదాగా కుటుంబ సభ్యులతో గడపటం, టి.వి.లో కార్యక్రమాలు చూస్తూ వినోదించడం, చిన్నాచితకా ఆరోగ్య సమస్యలకు డాక్టర్‌ దగ్గరకు పోకుండా ప్రత్యామ్నాయ, సాంప్రదాయ వైద్యవిధానాలతో సరిపెట్టుకుంటున్నారు. లాక్‌డౌన్‌ అనంతరం కూడా ప్రజల్లో ఈ చైతన్యం కొనసాగాలని నిపుణులు కోరుకుంటున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.