విశాఖపట్నం, అక్టోబర్ 12 (పున్నమి ప్రతినిధి)
విశాఖలో శ్రీ మన్మధరావు మెమోరియల్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాస్కెట్‌బాల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్రీడా స్ఫూర్తి, ఆత్మస్థైర్యం, పట్టుదలతో ముందుకు సాగితే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని సూచించారు. గెలుపు–ఓటములను సమానంగా చూడాలని, తల్లిదండ్రులు, గురువుల నమ్మకాన్ని నిలబెట్టాలని పిలుపునిచ్చారు. ఈ టోర్నమెంట్‌లో ఓర్ప్రిడ్జ్ ఇంటర్నేషనల్ గర్ల్స్ టీమ్ విజేతగా నిలవగా, సెయింట్ అల్లోయిసిస్ స్కూల్ రన్నరప్‌గా నిలిచింది. క్లబ్ అధ్యక్షుడు రామ్మోహన్ రావు, క్రీడా శిక్షకుడు అన్నెపు రామచందర్, ఇతర అతిథులు పాల్గొన్నారు.


