ఆత్మకూరు లో పోటీ “నరశింహస్వామి” ఆదేశమే…
పదేళ్ల పాలనలో మేకపాటి ది శూన్యమే……
ఆనం రామనారాయణరెడ్డి…
జయప్రతాప్ రెడ్డి నెల్లూరు బ్యూరో (ఏప్రిల్ పున్నమి)
ఆత్మకూరు లో మరలా పోటీ కి రావడం కేవలం నరశింహ స్వామి ఆదేశాలేనని ఆత్మకూరు దేశం అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. ఆనం పాత ప్రత్యర్థులు, కొత్త మిత్రులు అయిన మాజీ యమ్ యల్ ఎ లు కొమ్మి లక్ష్మయ్య నాయుడు,కంభం విజయరామిరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి లతో కలిసి మర్రిపాడు లోని శేఖర్ రెడ్డి నివాసంలో ఎన్నికల ప్రచారం కు శ్రీకారం చుట్టారు.
2009 లో నియోజకవర్గాల పునర్విభజన సంధర్భంగా ఒకటిన్నర దశాబ్దం రాజకీయం చేసిన రాపూరు ని వదిలి వై.యస్ సూచనల మేరకు ఆత్మకూరు లో అయిష్టత తోనే పోటీ చేశానని, ఆ సమయంలో మేకపాటి చంద్రశేఖరరెడ్డి తమ మండలాలు ఆత్మకూరు లో ఉన్నాయని అండగా నిలిచిన క్రమంలో పలువురు నేతల సహకారం తో విజయం సాధించి, మంత్రిని అయ్యానని అన్నారు.
జిల్లాలో ని 46 మండలాలలో నీటి సమస్య ఉన్న ఏకైక మండలం మర్రిపాడు కు కనీసం తాగు నీరు అయినా అందించే క్రమంలో కొన్ని కోట్ల రూపాయలతో పధకం కు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఆ తర్వాత యమ్ యల్ ఎ బాధ్యతలు చేపట్టిన వారు , ముఖ్యమంత్రి కి సన్నిహితులు గా మంత్రి పదవి చేపట్టిన, ఆయన తర్వాత యమ్ యల్ ఎ అయిన మరో వారసుడు మొత్తం మీద పదేళ్ల పాటు పదవిలో ఉన్నా కనీసం ఆ పధకం ప్రారంభించు కోలేక పోయారని ఎద్దేవా చేశారు. పదేళ్ల పాటు పెత్తనం ఇస్తే ఏమి కొత్త గా చేయలేని వారు, కనీసం మొదలు పెట్టిన వాటిని కూడా పూర్తి చేయలేని అసమర్దులకు ఓటు అడిగే హక్కు ఎలా ఉంటుందని అన్నారు. అభివృద్ధికి కేరాఫ్ గా ఆత్మకూరు ను చేసే క్రమంలో పదవీ కాలం పూర్తి అయిందని,ఆ తర్వాత వెంకటగిరి నుంచి ప్రాతినిధ్యం చేయాల్సి వచ్చిందని రామనారాయణరెడ్డి అన్నారు. ఈ సారి కూడా ఎన్నో ఊహాగానాల మధ్య మరలా
ఆత్మకూరు నుంచి పోటీ చేయడం.. ఖచ్చితంగా నరశింహస్వామి నిర్ణయమేనని అన్నారు.
గతంలో తాను చేయలేక మిగిలిన అభివృద్ధి ని పూర్తి చేసేందుకే భగవంతుడు ఆదేశించారని, ఆత్మకూరు ప్రజల రుణం తప్పక తీర్చుకుంటానని, మిగిలిన అభివృద్ధికి పూర్తి స్థాయిలో రూపం కల్పిస్తానని రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. తనకు తోడుగా నిలిచిన సిద్దాంత పరమైన మాజీ ప్రత్యర్థులు, మిత్రులం కొమ్మి,కంభం, మేకపాటి లతో కలిసి విజయం కైవసం చేసుకోవడం ఖాయమని ఆనంరామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు.
ఆత్మకూరు లో పోటీ “నరశింహస్వామి” ఆదేశమే… పదేళ్ల పాలనలో మేకపాటి ది శూన్యమే…… ఆనం రామనారాయణరెడ్డి…
ఆత్మకూరు లో పోటీ “నరశింహస్వామి” ఆదేశమే… పదేళ్ల పాలనలో మేకపాటి ది శూన్యమే…… ఆనం రామనారాయణరెడ్డి… జయప్రతాప్ రెడ్డి నెల్లూరు బ్యూరో (ఏప్రిల్ పున్నమి) ఆత్మకూరు లో మరలా పోటీ కి రావడం కేవలం నరశింహ స్వామి ఆదేశాలేనని ఆత్మకూరు దేశం అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. ఆనం పాత ప్రత్యర్థులు, కొత్త మిత్రులు అయిన మాజీ యమ్ యల్ ఎ లు కొమ్మి లక్ష్మయ్య నాయుడు,కంభం విజయరామిరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి లతో కలిసి మర్రిపాడు లోని శేఖర్ రెడ్డి నివాసంలో ఎన్నికల ప్రచారం కు శ్రీకారం చుట్టారు. 2009 లో నియోజకవర్గాల పునర్విభజన సంధర్భంగా ఒకటిన్నర దశాబ్దం రాజకీయం చేసిన రాపూరు ని వదిలి వై.యస్ సూచనల మేరకు ఆత్మకూరు లో అయిష్టత తోనే పోటీ చేశానని, ఆ సమయంలో మేకపాటి చంద్రశేఖరరెడ్డి తమ మండలాలు ఆత్మకూరు లో ఉన్నాయని అండగా నిలిచిన క్రమంలో పలువురు నేతల సహకారం తో విజయం సాధించి, మంత్రిని అయ్యానని అన్నారు. జిల్లాలో ని 46 మండలాలలో నీటి సమస్య ఉన్న ఏకైక మండలం మర్రిపాడు కు కనీసం తాగు నీరు అయినా అందించే క్రమంలో కొన్ని కోట్ల రూపాయలతో పధకం కు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఆ తర్వాత యమ్ యల్ ఎ బాధ్యతలు చేపట్టిన వారు , ముఖ్యమంత్రి కి సన్నిహితులు గా మంత్రి పదవి చేపట్టిన, ఆయన తర్వాత యమ్ యల్ ఎ అయిన మరో వారసుడు మొత్తం మీద పదేళ్ల పాటు పదవిలో ఉన్నా కనీసం ఆ పధకం ప్రారంభించు కోలేక పోయారని ఎద్దేవా చేశారు. పదేళ్ల పాటు పెత్తనం ఇస్తే ఏమి కొత్త గా చేయలేని వారు, కనీసం మొదలు పెట్టిన వాటిని కూడా పూర్తి చేయలేని అసమర్దులకు ఓటు అడిగే హక్కు ఎలా ఉంటుందని అన్నారు. అభివృద్ధికి కేరాఫ్ గా ఆత్మకూరు ను చేసే క్రమంలో పదవీ కాలం పూర్తి అయిందని,ఆ తర్వాత వెంకటగిరి నుంచి ప్రాతినిధ్యం చేయాల్సి వచ్చిందని రామనారాయణరెడ్డి అన్నారు. ఈ సారి కూడా ఎన్నో ఊహాగానాల మధ్య మరలా ఆత్మకూరు నుంచి పోటీ చేయడం.. ఖచ్చితంగా నరశింహస్వామి నిర్ణయమేనని అన్నారు. గతంలో తాను చేయలేక మిగిలిన అభివృద్ధి ని పూర్తి చేసేందుకే భగవంతుడు ఆదేశించారని, ఆత్మకూరు ప్రజల రుణం తప్పక తీర్చుకుంటానని, మిగిలిన అభివృద్ధికి పూర్తి స్థాయిలో రూపం కల్పిస్తానని రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. తనకు తోడుగా నిలిచిన సిద్దాంత పరమైన మాజీ ప్రత్యర్థులు, మిత్రులం కొమ్మి,కంభం, మేకపాటి లతో కలిసి విజయం కైవసం చేసుకోవడం ఖాయమని ఆనంరామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు.

