పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆత్మకూరు నియోజకవర్గంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమం జనసేన పార్టీ ఇంచార్జి నలిశెట్టి శ్రీధర్ గారి ఆధ్వర్యంలో జరిగింది.
ఈ రక్తదాన శిబిరంలో అనంతసాగరం మండలానికి చెందిన జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమానికి అనంతసాగరం మండల జనసేన పార్టీ పెద్దలు రవి, ఉదయగిరి బీవీ రమణ, పార్టీ నేతలు నరసింహ రాయల్, ఎం. కృష్ణ తదితరులు హాజరై రక్తదానం చేసి సేవా భావాన్ని చాటుకున్నారు.
సమాజానికి అవసరమైన సమయంలో రక్తదానం ప్రాణాలను కాపాడే మహత్తర సేవ అని నాయకులు పేర్కొన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని తెలిపారు.



