ఘనంగా – మంత్రి ఆనం నేతృత్వంలో పసుపు జోష్
ఆత్మకూరు, మార్చి (పున్నమి ప్రతినిధి): మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సారథ్యంలో ఆత్మకూరులో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. బైపాస్ రోడ్ సమీపంలో ఏర్పాటు చేసిన సభకు భారీగా కార్యకర్తలు, నాయకులు హాజరై పసుపుమయ వాతావరణాన్ని సృష్టించారు. శిలాఫలక ఆవిష్కరణ, పతాకావిష్కరణ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. “సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు” అన్న నినాదంతో పేదల కోసం ఏర్పడిన టీడీపీ సిద్ధాంతాలను గుర్తుచేశారు. జై తెలుగుదేశం, జై ఆనం నినాదాలతో పట్టణం మారుమోగింది.
Uploaded Video:

