Monday, 23 March 2026
  • Home  
  • ఆటో డ్రైవర్ అదృశ్యం – ఆందోళనలో కుటుంబం
- ఆంధ్రప్రదేశ్

ఆటో డ్రైవర్ అదృశ్యం – ఆందోళనలో కుటుంబం

తాటిచెట్లపాలెం తారకరామనగర్-2 వాసి సిరిశెట్టి ఈశ్వరరావు (40), పద్మశాలి కులం చెందిన ఆటో డ్రైవర్ అదృశ్యమయ్యారు. వివరాల్లోకి వెళ్తే… ఫైనాన్స్ విషయమై ఇంటిలో చిన్న గొడవ కారణంగా సెప్టెంబర్ 20న మధ్యాహ్నం 4 గంటల సమయంలో ఈశ్వరరావు ఇంటి నుండి బయటకు వెళ్లిపోయారు. ఆయన ఆటో, ఆటో తాళాలు, ఖాకీ షర్ట్ ను ఇంటి వద్దే వదిలిపెట్టి వెళ్ళినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అదే రోజు రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో వెతికినా ఆయన ఎక్కడా కనబడలేదు. దీంతో ఆయన భార్య సిరిశెట్టి సంతోష్ కుమారి సెప్టెంబర్ 22న IV టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు CI కేసు నమోదు చేసి, దర్యాప్తు బాధ్యతను హెడ్ కానిస్టేబుల్ ఎం.ఎస్‌.ఎస్‌. శ్రీనివాస్ కి అప్పగించారు. ఈశ్వరరావు గమ్యం గురించి సమాచారం తెలిసినవారు వెంటనే IV టౌన్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.


తాటిచెట్లపాలెం తారకరామనగర్-2 వాసి సిరిశెట్టి ఈశ్వరరావు (40), పద్మశాలి కులం చెందిన ఆటో డ్రైవర్ అదృశ్యమయ్యారు.

వివరాల్లోకి వెళ్తే… ఫైనాన్స్ విషయమై ఇంటిలో చిన్న గొడవ కారణంగా సెప్టెంబర్ 20న మధ్యాహ్నం 4 గంటల సమయంలో ఈశ్వరరావు ఇంటి నుండి బయటకు వెళ్లిపోయారు. ఆయన ఆటో, ఆటో తాళాలు, ఖాకీ షర్ట్ ను ఇంటి వద్దే వదిలిపెట్టి వెళ్ళినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

అదే రోజు రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో వెతికినా ఆయన ఎక్కడా కనబడలేదు. దీంతో ఆయన భార్య సిరిశెట్టి సంతోష్ కుమారి సెప్టెంబర్ 22న IV టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు CI కేసు నమోదు చేసి, దర్యాప్తు బాధ్యతను హెడ్ కానిస్టేబుల్ ఎం.ఎస్‌.ఎస్‌. శ్రీనివాస్ కి అప్పగించారు.

ఈశ్వరరావు గమ్యం గురించి సమాచారం తెలిసినవారు వెంటనే IV టౌన్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.