Thursday, 5 February 2026
  • Home  
  • ఆగస్టు 13 న హైదరాబాద్ లో చేయూత పెన్షన్ దారుల మహాగర్జన.
- యాదాద్రి భువనగిరి

ఆగస్టు 13 న హైదరాబాద్ లో చేయూత పెన్షన్ దారుల మహాగర్జన.

యాదాద్రి భువనగిరి జిల్లా, పున్నమి ప్రతినిధి సిద్దయ్య ఆగస్టు 13 న హైదరాబాద్ లో చేయూత పెన్షన్ దారుల మహాగర్జన. రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం చేయూత పెన్షన్ లన్ని తక్షణమే పెంచాలి. – ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ వివరణ :- కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగులకు రూ 6000, మరియు వృద్దులు వితంతువులు ఒంటరి మహిళలు నేత, గీత,బీడీ కార్మికులతో పాటు అన్ని రకాల చేయుత పెన్షన్లను రూ.4000 పెంచాలని డిమాండ్ చేస్తూ మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో ఆగస్టు 13 న హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో పెన్షన్ దారుల మహాగర్జనను నిర్వహిస్తున్నామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ అన్నారు. భువనగిరి పట్టణంలోని AR గార్డెన్స్ లో వికలాంగుల, వృద్ధుల, వితంతువుల,వికలాంగుల, చేయూత పెన్షన్ దారుల జిల్లా మహాసభ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ ” ఎమ్మార్పీఎస్ ఉద్యమం మాదిగల కోసమే ఏర్పడిన అనేక సామాజిక సమస్యల మీద పోరాటం చేస్తూ అన్ని వర్గాల ప్రజల పక్షాన నిలబడిందని అన్నారు.అందులో భాగంగానే ఆరోగ్యశ్రీ పథకం,వికలాంగులు, వృద్దులు, వితంతువులు ఇతర పెన్షన్ దారుల పెన్షన్లు పెంచాలని పోరాడి విజయం సాధించిందని అన్నారు.ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు,తెల్లరేషన్ కార్డులకు రూ 6 కిలోల బియ్యం పెంపు, మహిళ అత్యాచారాల నిరోధానికి 36 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ అక్ట్ పునరుద్ధరణ మొదలగు వాటి మీద పోరాడి పాలకుల మెడలు వంచి సాధించడం జరిగిందని అన్నారు.అదే విధంగా నేడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగులకు రూ.4000 నుండి రూ 6000 వరకు మరియు వృద్దులు వితంతువులు ఒంటరి మహిళలు నేత గీత బీడీ కార్మికులతో పాటు అన్ని రకాల చేయుత పెన్షన్లు రూ 2000 నుండి 4000 పెంచాలని కండరాల క్షీణత కలిగిన వారికి రూ 15000 పెన్షన్లు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగింది.పెన్షన్ దారులకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి 19 నెలల గడిచినా నెరవేర్చకుండా ఘోరంగా మోసం చేయడం జరిగిందని అన్నారు.ఆగస్టు 13 న లక్షలాది మంది పెన్షన్ దారులతో మహా గర్జనను నిర్వహించి తాడోపేడో తేల్చుకుంటామని అన్నారు.ప్రతి గ్రామం నుండి చేయూత పెన్షన్ దారులు స్వచ్ఛందంగా కదలి రావాలని పిలుపునిచ్చారు.రేపటి నుండి ప్రతి గ్రామంలో నూతన ఎమ్మార్పీఎస్ కమిటీలను ఏర్పాటు చేసి దండోరా జెండా ఆవిష్కరణలు చేయాలని ఉద్యమ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి గడ్డం కాసీమ్, జిల్లా అధ్యక్షులు ధరణికొట నర్సింహ్మా, ఎమ్మార్పియస్ జిల్లా ఇంచార్జీ బిర్రు మహేందర్ మాదిగ, కో ఇంచార్జీ పల్లెర్ల సుధాకర్ మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ, ఎమ్మార్పియస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇటుకల దేవేందర్ మాదిగ, ఎమ్మార్పియస్ జిల్లా అధ్యక్షులు దుబ్బ రామకృష్ణ మాదిగ, దళిత ఐక్య వేదిక చైర్మన్ భట్టు రాంచంద్రయ్య, వి ఎచ్ పీయస్ నాయకులు గిద్దె రాజేష్, సింగారం రమేష్, లోడి ధనుంజయ్య గౌడ్,సందేల శ్రీనివాస్ మాదిగ, బండారి శివశంకర్,రజిత, పద్మ, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా,
పున్నమి ప్రతినిధి సిద్దయ్య

ఆగస్టు 13 న హైదరాబాద్ లో చేయూత పెన్షన్ దారుల మహాగర్జన.

రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం చేయూత పెన్షన్ లన్ని తక్షణమే పెంచాలి.

– ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ

వివరణ :- కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగులకు రూ 6000, మరియు వృద్దులు వితంతువులు ఒంటరి మహిళలు నేత, గీత,బీడీ కార్మికులతో పాటు అన్ని రకాల చేయుత పెన్షన్లను రూ.4000 పెంచాలని డిమాండ్ చేస్తూ మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో ఆగస్టు 13 న హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో పెన్షన్ దారుల మహాగర్జనను నిర్వహిస్తున్నామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు
మంద కృష్ణ మాదిగ అన్నారు.

భువనగిరి పట్టణంలోని AR గార్డెన్స్ లో
వికలాంగుల, వృద్ధుల, వితంతువుల,వికలాంగుల, చేయూత పెన్షన్ దారుల జిల్లా మహాసభ జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ ” ఎమ్మార్పీఎస్ ఉద్యమం మాదిగల కోసమే ఏర్పడిన అనేక సామాజిక సమస్యల మీద పోరాటం చేస్తూ అన్ని వర్గాల ప్రజల పక్షాన నిలబడిందని అన్నారు.అందులో భాగంగానే ఆరోగ్యశ్రీ పథకం,వికలాంగులు, వృద్దులు, వితంతువులు ఇతర పెన్షన్ దారుల పెన్షన్లు పెంచాలని పోరాడి విజయం సాధించిందని అన్నారు.ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు,తెల్లరేషన్ కార్డులకు రూ 6 కిలోల బియ్యం పెంపు, మహిళ అత్యాచారాల నిరోధానికి 36 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ అక్ట్ పునరుద్ధరణ మొదలగు వాటి మీద పోరాడి పాలకుల మెడలు వంచి సాధించడం జరిగిందని అన్నారు.అదే విధంగా నేడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగులకు రూ.4000 నుండి రూ 6000 వరకు మరియు వృద్దులు వితంతువులు ఒంటరి మహిళలు నేత గీత బీడీ కార్మికులతో పాటు అన్ని రకాల చేయుత పెన్షన్లు రూ 2000 నుండి 4000 పెంచాలని కండరాల క్షీణత కలిగిన వారికి రూ 15000 పెన్షన్లు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగింది.పెన్షన్ దారులకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి 19 నెలల గడిచినా నెరవేర్చకుండా ఘోరంగా మోసం చేయడం జరిగిందని అన్నారు.ఆగస్టు 13 న లక్షలాది మంది పెన్షన్ దారులతో మహా గర్జనను నిర్వహించి తాడోపేడో తేల్చుకుంటామని అన్నారు.ప్రతి గ్రామం నుండి చేయూత పెన్షన్ దారులు స్వచ్ఛందంగా కదలి రావాలని పిలుపునిచ్చారు.రేపటి నుండి ప్రతి గ్రామంలో నూతన ఎమ్మార్పీఎస్ కమిటీలను ఏర్పాటు చేసి దండోరా జెండా ఆవిష్కరణలు చేయాలని ఉద్యమ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో
వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి గడ్డం కాసీమ్,
జిల్లా అధ్యక్షులు ధరణికొట నర్సింహ్మా,
ఎమ్మార్పియస్ జిల్లా ఇంచార్జీ బిర్రు మహేందర్ మాదిగ,
కో ఇంచార్జీ పల్లెర్ల సుధాకర్ మాదిగ,
ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ,
ఎమ్మార్పియస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇటుకల దేవేందర్ మాదిగ,
ఎమ్మార్పియస్ జిల్లా అధ్యక్షులు దుబ్బ రామకృష్ణ మాదిగ,
దళిత ఐక్య వేదిక చైర్మన్ భట్టు రాంచంద్రయ్య,
వి ఎచ్ పీయస్ నాయకులు గిద్దె రాజేష్, సింగారం రమేష్, లోడి ధనుంజయ్య గౌడ్,సందేల శ్రీనివాస్ మాదిగ, బండారి శివశంకర్,రజిత, పద్మ, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.