Sunday, 7 December 2025
  • Home  
  • ఆక్వా ఉత్పత్తుల ప్రోత్సాహంపై ప్రత్యేక దృష్టి ప్రభుత్వం దిశ! – ప్రతిపక్షం దిశ!
- ఆంధ్రప్రదేశ్

ఆక్వా ఉత్పత్తుల ప్రోత్సాహంపై ప్రత్యేక దృష్టి ప్రభుత్వం దిశ! – ప్రతిపక్షం దిశ!

సెప్టెంబర్ 24 పున్నమి ప్రతినిధి @అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు చేపలు, రొయ్యలు తినే అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. వారంలో కనీసం ఒక రోజు అయినా సీ ఫుడ్ తీసుకోవడం ఆరోగ్యానికి మేలని ఆయన పేర్కొన్నారు. చికెన్ కంటే ఎక్కువ ప్రోటీన్, పోషకాలు ఆక్వా ఉత్పత్తుల్లో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రోటీన్ వినియోగాన్ని పెంచే దిశగా ప్రోత్సాహం అందిస్తామని స్పష్టం చేశారు. స్కూళ్లు, కాలేజీల మధ్యాహ్న భోజనంలో వారానికి ఒక రోజు చేపలు, రొయ్యలు వడ్డించే ప్రయత్నం చేస్తాం అని సీఎం హామీ ఇచ్చారు. ప్రతిపక్ష వైఎస్ఆర్‌సీపీ స్పందన సీఎం వ్యాఖ్యలపై ప్రతిపక్షం కూడా స్పందించింది. ఆక్వాకు ప్రత్యేక గుర్తింపు ఇస్తామని వైఎస్ఆర్‌సీపీ నాయకులు హామీ ఇచ్చారు. తక్షణమే స్కూల్ మెనూలో చేపలు, రొయ్యలు చేర్చే అంశంపై వారు మద్దతు తెలిపారు. ఇక రైతుల ప్రయోజనాల దిశగా, ఎటువంటి ఆంక్షలు లేకుండా ఆక్వాకు కరెంట్ సబ్సిడీ కొనసాగించాలని, ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి రైతులతో కలిసి ఫీడ్ ధరలను మానిటర్ చేయాలి అని అన్నారు. ఆక్వాపై రెండు దృక్కోణాలు ప్రభుత్వం దిశ : ప్రజారోగ్య పరంగా ఆక్వా వినియోగం పెంచే ప్రయత్నం. ప్రతిపక్షం దిశ: రైతు ప్రయోజనాల దిశగా సబ్సిడీలు, ఫీడ్ ధర నియంత్రణ కోసం ప్రత్యేక కమిటీలు.

సెప్టెంబర్ 24 పున్నమి ప్రతినిధి @అమరావతి:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు చేపలు, రొయ్యలు తినే అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. వారంలో కనీసం ఒక రోజు అయినా సీ ఫుడ్ తీసుకోవడం ఆరోగ్యానికి మేలని ఆయన పేర్కొన్నారు.

చికెన్ కంటే ఎక్కువ ప్రోటీన్, పోషకాలు ఆక్వా ఉత్పత్తుల్లో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రోటీన్ వినియోగాన్ని పెంచే దిశగా ప్రోత్సాహం అందిస్తామని స్పష్టం చేశారు. స్కూళ్లు, కాలేజీల మధ్యాహ్న భోజనంలో వారానికి ఒక రోజు చేపలు, రొయ్యలు వడ్డించే ప్రయత్నం చేస్తాం అని సీఎం హామీ ఇచ్చారు.

ప్రతిపక్ష వైఎస్ఆర్‌సీపీ స్పందన

సీఎం వ్యాఖ్యలపై ప్రతిపక్షం కూడా స్పందించింది. ఆక్వాకు ప్రత్యేక గుర్తింపు ఇస్తామని వైఎస్ఆర్‌సీపీ నాయకులు హామీ ఇచ్చారు. తక్షణమే స్కూల్ మెనూలో చేపలు, రొయ్యలు చేర్చే అంశంపై వారు మద్దతు తెలిపారు.

ఇక రైతుల ప్రయోజనాల దిశగా, ఎటువంటి ఆంక్షలు లేకుండా ఆక్వాకు కరెంట్ సబ్సిడీ కొనసాగించాలని, ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి రైతులతో కలిసి ఫీడ్ ధరలను మానిటర్ చేయాలి అని అన్నారు.

ఆక్వాపై రెండు దృక్కోణాలు

ప్రభుత్వం దిశ : ప్రజారోగ్య పరంగా ఆక్వా వినియోగం పెంచే ప్రయత్నం.

ప్రతిపక్షం దిశ: రైతు ప్రయోజనాల దిశగా సబ్సిడీలు, ఫీడ్ ధర నియంత్రణ కోసం ప్రత్యేక కమిటీలు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.