శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ అంచనాల కమిటీ (PUC) ఆధ్వర్యంలో సింహాచలం దేవస్థానం అభివృద్ధి మరియు ఆర్థిక అంచనాలపై సమీక్షా సమావేశం.
*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి *
ఆంధ్రప్రదేశ్ శాసనసభ (APLA) అంచనాలపై కమిటీ (PUC), గౌరవనీయులైన ఎమ్మెల్యే, శ్రీ వి. జోగేశ్వరరావు (మండపేట) గారి అధ్యక్షతన, 2025 నవంబర్ 26వ తేదీన విశాఖపట్నంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం (SVLNSD), సింహాచలంను సందర్శించింది.
ఈ కమిటీలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ (APLA) నుండి. గౌరవ సభ్యులలో శ్రీ జయకృష్ణ నిమ్మక, శ్రీ మద్దిపాటి వెంకట రాజు, డాక్టర్ వి.వి. సూర్యనరాయణ రాజు పెనుమత్స, మరియు శ్రీ ఏలూరి సాంబశివ రావు పాల్గొన్నారు.
శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం యొక్క అంచనాలను సమీక్షించడం.
ఆలయ అభివృద్ధి పనులు మరియు యాత్రికులకు అందిస్తున్న సౌకర్యాలపై పరిశీలన.
కమిటీ ఛైర్మన్ మరియు సభ్యులు మొదట ఆలయ ప్రాంగణాన్ని సందర్శించి, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం దేవస్థానం ప్రాంగణంలోని సమావేశ మందిరంలో దేవస్థానం కార్యనిర్వహణ అధికారి , శ్రీమతి ఎన్. సుజాత గారితో మరియు ఇతర అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భీమిలి ఆర్డిఓ మరియు చిన్నగదిలి ఎంఆర్ఓ లు పాల్గొన్నారు
2019-20, 2020-21, మరియు 2021-22 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన దేవస్థానం యొక్క అంచనాలు (Estimates) మరియు ఆర్థిక వ్యయ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఆలయ అభివృద్ధి పనుల పురోగతి మరియు వాటికి సంబంధించిన అంచనాల అమలు.
యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి తీసుకుంటున్న చర్యలు పై చర్చించారు.
ఈ సమావేశంలో దేవస్థానం తరపున కార్యనిర్వహణ అధికారి శ్రీమతి ఎన్. సుజాత, అడ్మినిస్ట్రేటివ్ సహాయ కార్యనిర్వహణ అధికారి వాడ్రేవు రమణమూర్తి, ఆలయ సహాయ కార్యనిర్వహణ అధికారి కె. తిరుమలేశ్వరరావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామకృష్ణ ,రమణ, రాంబాబు, ఏ.ఈ. (ఎలక్ట్రికల్) తాతాజీ, బంగార్రాజు, ఏ.ఈ. (సివిల్) రవిరాజు, తిరుపతి రావు, లోకేష్, పర్యవేక్షణ అధికారులు కె.వి.వి. సత్యనారాయణమూర్తి , బి సత్య శ్రీనివాస్ మరియు ఇతర ముఖ్య సిబ్బంది పాల్గొన్నారు.
కమిటీ ఇచ్చిన సూచనలు మరియు ఆదేశాలను అమలు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని దేవస్థానం అధికారులను గౌరవ ఛైర్మన్ శ్రీ వి. జోగేశ్వరరావు ఆదేశించారు.


