నంద్యాల ఆంధ్రప్రదేశ్ ను పెట్టుబడుల హబ్ గా మార్చేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఎంత వ్యూహాత్మకంగా శ్రమిస్తున్నారో నిరూపణగా CII భాగస్వామ్య సదస్సు నిలిచిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ అన్నారు
ఈ సందర్భంగా స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం (రాజ్ టాకీస్) నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్, నందికొట్కూరు ఎమ్మెల్యే గీతా జయసూర్య మాట్లాడుతూ CII భాగస్వామ్య సదస్సు ద్వారా పెట్టుబడుల యుగానికి పునాది పడటం మాత్రమే కాకుండా , ఆంధ్రప్రదేశ్ ను గ్లోబల్ దృష్టిని మళ్లీ కేంద్రీకరించిందని అన్నారు. పెట్టుబడులకు ఏపీని గమ్యస్థానంగా నిలపడంలో చంద్రబాబు మరోసారి తన ప్రావీణ్యాన్ని నిరూపించారని. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాలకు సమానంగా పెట్టుబడులు వచ్చేలా మంత్రి లోకేష్ ప్రత్యేకంగా కంపెనీలను గైడ్ చేశారని . ప్రతి రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను అనుసరిస్తుంటే ఆంధ్రప్రదేశ్ అందుకు భిన్నంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను అనుసరిస్తుండడంతో రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కట్టాయన్నారు . ప్రతి రంగానికి స్పష్టమైన పాలసీలు రూపకల్పన చేసి, సింగిల్ విండో సిస్టమ్ ద్వారా పెట్టుబడులకు అన్ని అనుమతులు వేగంగా ఇవ్వడం వంటివి పరిశ్రమలు ఆకర్షణకు ప్రధాన కారణమన్నారు . రెండు రోజుల్లోనే భారీ ఎత్తున ఒప్పందాలు కుదుర్చుకొని పెట్టుబడుల వర్షం కురిపించడం చంద్రబాబు, లోకేష్ కి పెట్టుబడుల పట్ల ఉన్న స్పష్టమైన విజన్ ను చూపిందని మొత్తం 613 ఒప్పందాల ద్వారా రూ.13,25,716 కోట్ల పెట్టుబడులు, 16,13,188 ఉద్యోగాలు రావడం రాష్ట్ర అభివృద్ధి పట్ల పెట్టుబడిదారుల నమ్మకానికి ప్రత్యక్ష సాక్ష్యం అన్నారు. అంచనాలకు మించి పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ వైపు పరుగెత్తి రావడం చంద్రబాబు, లోకేష్ నాయకత్వంలో అభివృద్ధి మళ్లీ ట్రాక్పైకి వచ్చిందని నిరూపించిందని. సదస్సుకు ఒక రోజు ముందే రాష్ట్రంలో పెట్టుబడుల వరద మొదలైంది. రూ.3,65,304 కోట్లు పెట్టుబడులతో 1,26,471 ఉద్యోగావకాశాలు సృష్టించే 35 సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడం చూస్తుంటే ప్రభుత్వంపై పారిశ్రామికవేత్తలో విశ్వాసం ఎలా ఉందో తేటతెల్లమైందని. తొలి రోజు ఒక్కరోజే రూ.8.26 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు, వాటి ద్వారా 12.05 లక్షల ఉద్యోగాలు నమోదవడం ఏపీ అభివృద్ధికి గట్టి బలం అని. ఏపీ సీఆర్డీఏ, ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, ఎలక్ట్రానిక్స్, టూరిజం, మున్సిపల్ వంటి కీలక శాఖల్లో ఒప్పందాలు కుదరడం పెట్టుబడులను సమగ్రంగా ఆకర్షిస్తున్న ప్రభుత్వ నైపుణ్యాన్ని చూపిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ను పెట్టుబడుల హబ్ గా మార్చేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ వ్యూహాత్మకంగా చేసిన కృషికి ఈ సదస్సు ప్రతిఫలంగా నిలిచిందని. జగన్ రెడ్డి విధ్వంసకర విధానాలకు భయపడి రాష్ట్రం విడిచి వెళ్ళిపోయిన రెన్యూ, హీరో ఫ్యూచర్స్, ఏబీసీ వంటి కంపెనీలు సైతం చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలు, లోకేష్ అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు ఆకర్షితులై తిరిగి రాష్ట్రానికి వచ్చాయన్నారు.. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి జిల్లెల్ల శ్రీరాములు, కార్పొరేషన్ డైరెక్టర్లు ఉప్పరి సురేష్ కుమార్, దూదేకుల దస్తగిరి పాల్గొన్నారు


