సెప్టెంబర్ 21 పున్నమి ప్రతినిధి @
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా కసరత్తు చేస్తోంది. ఎక్సైజ్ శాఖ రాష్ట్రంలో తీసుకొచ్చిన కొత్త బార్ల పాలసీకి అనుగుణంగా టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది.
కొత్త దరఖాస్తులకు ఆశించిన స్పందన రాలేదు. దీంతో, దరఖాస్తుల కోసం సమయం పొడిగించారు. ఇక.. బార్ల నిర్వాహకులు ఏఈఆర్టీ పైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారుల నిరాసక్తత కారణంగా ఇప్పుడు ఎక్సైజ్ శాఖ ఏఈఆర్టీ సడలింపు పైన కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే వారం నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఎక్సైజ్ శాఖ ప్రభుత్వం ఖరారు చేసిన కొత్త బార్ల పాలసీ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 840 బార్లకు కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసింది. 412 బార్లకు మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. దీంతో, మిగిలిన వాటికి సమయం పొడిగిస్తూ మరో సారి నోటిఫికేషన్ జారీ చేసింది. 17వ తేదీతో గడువు ముగిసింది. అయితే, 96 బార్లకు మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. మరో 336 బార్లకు దరఖాస్తులు రాలేదు. ప్రధానంగా గోదావరి, ఏజెన్సీ ప్రాంతాల్లో బార్ల నిర్వహణకు వ్యాపారులు ఆసక్తి చూపటం లేదు. మద్యం షాపుల్లో పర్మిట్ రూమ్స్ కు అనుమతి.. రూ 99కే క్వార్టర్ లిక్కర్ అమ్మకాల కారణంగా బార్ల పైన వ్యాపారులు ఆసక్తి చూపటం లేదనే వాదన ఉంది. దీంతో, పాటుగా అదనపు ఎక్సైజ్ రిటైల్ టాక్స్ భారంగా భావిస్తున్నారు. ఇప్పుడు ఈ టాక్స్ పైన ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.


