పున్నమి ప్రతినిధి అక్టోబర్ విశాఖపట్నం
అల్లూరు జిల్లా జడ్పిటిసి వారా నూకరాజు హత్య
కొయ్యూరు మండలం వైసిపి జడ్పిటిసి వారా నూకరాజు దారుణ హత్య గురయ్యారు. రోలుగుంట మండలం చటర్జీ పురం వద్ద ఆయనకు పది ఎకరాల పొలం ఉంది. భూమికి సంబంధించిన పట్టా ఆయన పేరు మీదే ఉంది. అయితే ఆ భూమిని గిరిజనులు సాగు చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ భూ విషయం మీద గిరిజనులకు ఆయనకు గొడవలు జరుగుతున్నాయి. గతంలో ఆయన మీద గిరిజనులు దాడి చేశారు. ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో దాదాపు నెల రోజులపాటు చికిత్స పొంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ గొడవల నేపథ్యంలో బైండోవర్ కేసులు కూడా పోలీసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం జడ్పిటిసి నూకరాజు భూముల దగ్గరికి వెళ్లారు. గిరిజనులకు ఆయనకు మధ్య వాగ్వాదం నడిచింది. మాట మాట పెరిగి గిరిజనులు ఆయనను హత్య చేశారు. సమాచారం అందుకున్న రోలుగుంటం పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి దర్యాప్తు మొదలుపెట్టారు.


